Viral News: 15 ఏళ్ల ఆన్‌లైన్ షాపింగ్ అంటే భయపడేవారు. సరైన వస్తువులు వస్తాయో రావో అని సంకోచించేవారు. కానీ ఇప్పుడు సాధారణ విషయం అయిపోయింది. అయితే కొన్నిసార్లు ఊహించని సంఘటనలు ఇప్పటికీ ఆన్‌లైన్ షాపింగ్ అంటే ఆలోచించే పరిస్థితి తీసుకొస్తున్నాయి.
కేరళ రాష్ట్రంలోని కోట్టాయం జిల్లా పాయక్ ప్రాంతానికి చెందిన డాన్ టోమ్ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అయిన అమెజాన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన కొన్ని రోజుల తర్వాత పార్సెల్ డెలివరీ అయ్యింది. ఎంతో ఆసక్తిగా బాక్స్ తెరిచిన అతడికి పెద్ద షాక్ ఎదురైంది.
26
రూ. 56,000 ల్యాప్‌టాప్… లోపల రాళ్లు, దుస్తులు
డాన్ టోమ్ ఫిబ్రవరి 12న సుమారు రూ. 56,000 విలువైన లెనోవో ThinkPad E14 ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేశాడు. ఫిబ్రవరి 18న మధ్యాహ్నం సమయంలో పార్సిల్ అతని ఇంటికి చేరింది. కార్డ్‌బోర్డ్ పెట్టె బాగా ప్యాక్ చేసి ఉంది. కానీ బాక్స్ తెరిచేసరికి అందులో ల్యాప్‌టాప్ స్థానంలో రాళ్లు, దుస్తుల ముక్కలు కనిపించాయి. దీనితో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు.
36
అమెజాన్‌కు ఫిర్యాదు
ఈ ఘటనపై వెంటనే డాన్ టోమ్ అమెజాన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పార్సెల్‌లో వచ్చిన రాళ్లు, దుస్తుల ఫోటోలు కూడా జతచేశాడు. తాను లెనోవో ThinkPad E14 ల్యాప్‌టాప్ ఆర్డర్ చేసినట్లు స్పష్టంగా పేర్కొన్నాడు.
సంఘటనపై స్పందించిన అమెజాన్ ప్రతినిధులు విషయం పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 23న సంప్రదిస్తామని, రీఫండ్ గురించి అప్పుడు మాట్లాడుతామని చెప్పారు. ఇక డాన్ టోమ్ ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు.
56
ఆన్‌లైన్ కొనుగోలుదారుల్లో ఆందోళన
ఈ ఘటన ఎక్కడ జరిగింది? మధ్యలో ఎవరు తారుమారు చేశారు? అనే విషయాలు ఇప్పటికీ స్పష్టంగా లేవు. అయితే ఈ సంఘటన ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆన్‌లైన్‌లో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే సమయంలో డెలివరీ సమయంలోనే పార్సిల్ చెక్ చేయడం, వీడియో తీయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ తర్వాతే అసలు విషయం వెలుగులోకి రానుంది.