ఇంటర్నెట్‌లో ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. ఏటీఎమ్ రూమ్‌కు సంబంధించిన వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. ఈ సంఘటన బిహార్‌లో జరిగినట్లు వీడియోలో పేర్కొన్నారు. అయితే దీనిపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు.
24
ఏటీఎమ్‌లో తాళాలు
సాధారణంగా ఏటీఎమ్ అంటేనే భద్రత ఎక్కువగా ఉంటుంది. బయటకు ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడు. లోపల కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ వీడియోలో ఉన్న ఏటీఎమ్‌లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.
34
ఏసీకి, సీసీటీవీ కూడా భద్రత
ఏటీఎమ్‌లో ఉన్న ఏసీని ఎవరూ దొంగలించకుండా ఉండేందుకు ఒక గ్రిల్‌ను ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా ఆ గ్రిల్‌కు ఒక తాళం కూడా వేశారు. అంతటితో ఆగకుండా ఏటీఎమ్‌లో ఉన్న సీసీటీవీకి కూడా తాళం వేయడం గమనార్హం. సెక్యూరిటీకి కూడా సెక్యూరిటీ కావాలంటూ క్యాప్షన్ జోడించారు.
వీడియోని Instagramలో bihari_018_ అనే అకౌంట్‌లో షేర్ చేయగా లక్షల మంది వీక్షించారు. వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఇక లెక్కలేనని కామెంట్స్ కూడా వచ్చాయి. “భద్రత ఇచ్చే వస్తువుకు కూడా భద్రత కావాలి.” “ఇది అవసరం అయితే, ఇది పూర్తిగా అవమానకరం.” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ట్రెండ్ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.