Viral News
* 'ఊరిలో పెళ్లికి కుక్కల హడావుడి' అనే సామెత గురించి వినే ఉంటాం. మనకు సంబంధం లేని విషయంలో ఎక్కువగా హంగామా చేస్తుంటే ఈ సామెతను ఉపయోగిస్తుంటాం. ఒకవేళ కుక్కులు మాట్లాడితే.. 'మీ ఊరిలో పెళ్లికి మేం ఎందుకు హడావుడి చేస్తామండి' అని ప్రశ్నిస్తాయి కాబోలు.
* ఒక వస్తువు గొప్పతనం గుర్తించలేకపోయినా, దానిని ఎలా ఉపయోగించాలో తెలియకపోయినా.. 'పందికి ఏం తెలుస్తుంది పాండ్స్ పౌడర్ వాసన' అనే సామెత వినే ఉంటాం. ఒకవేళ పందులు మాట్లాడితే.. 'అసలు మాకు పాండ్స్ పౌడర్‌తో పనేంటి' అని కచ్చితంగా ప్రశిస్తాయి.
Crocodile
* ఒకవేళ మొసలికి మాటలొస్తే అది ముందుగా అడిగే ప్రశ్న.. 'మేము అసలు పండుగలు చేసుకోమని' కాబోలు. ముందుంది ముసళ్ల పండగ అనే సామెత గురించి వినే ఉంటాం.
* ఆకలి వేస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని అంటుంటారు. ఒకవేళ ఎలుకలు మాట్లాడితే.. 'మీ పొట్టలో మేము ఎందుకు పరిగెడుతామని' అడుగుతాయి కావొచ్చు.
red fox
* మన స్థోమతకు మించి రెచ్చిపోయే వారిని ఉద్దేశిస్తూ.. 'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు' అనే సామెత చెబుతుంటారు. ఒకవేళ నక్క నిజంగానే మాట్లాడితే.. 'అసలు పులిని చూసి నేనేందుకు వాతలు' పెట్టుకుంటాననని అడుగుతుంది కాబోలు.
* ఒకవేళ కాకి మాట్లాడితే.. మొదట అడిగే ప్రశ్న 'అసలు మీ కాళ్లను మేమేందుకు మింగుతాం' అని అడుగుతాయి కాబోలు. ఏదైనా వస్తువు కనిపించకపోతే కాళ్లు కాకులు మింగాయా.? అనే సామెత ఉందన్న విషయం తెలిసిందే.
* పాములు మాట్లాడితే అడిగే ప్రశ్న.. 'ఎన్ని సార్లు కొట్టినా మేము ఎందుకు చావం' అని అంటాయి కాబోలు. మొండి ఘటాలను.. ఎన్నిసార్లు కొట్టినా చావని పామువురా నువ్వు అని తిడుతుంటారన్న విషయం తెలిసిందే.
* ఎవరినైనా గుడ్డిగా నమ్మితే.. వారిని ఉద్దేశిస్తూ 'గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది' అనే సామెతను ఉపయోగిస్తుంటారు. ఒకవేళ గొర్రెలకు మాటలొస్తే.. బహుశా మొదట 'అసలు మేం ఎందుకు కసాయి వాడిని నమ్ముతాం' అని ప్రశ్నిస్తుంది కాబోలు.