Viral News: చనిపోయిన బంధువులు మళ్లీ తిరిగొస్తే.. పెళ్లి వేడుకల్లో కంటతడి పెట్టిస్తోన్న AI వీడియోలు.

కాలం మారింది, మారుతోన్న కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో ప్రపంచమే మారిపోయింది. అన్ని రంగాల్లో ఏఐ సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తోంది. పెళ్లి వేడుకల్లో కూడా ఇప్పుడు ఏఐ రాజ్యమేలుతోంది.. 
 

AI Brings Back Deceased Loved Ones in Wedding Videos Emotional Moments Go Viral details in telugu VNR
AI Viral Video

ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీవితంలో ఎవరైనా ఒకేసారి చేసుకోవాలని కోరుకునే వేడుక వివాహం. అలాంటి వివాహాన్ని వైభవంగా జరుపుకోవాలని అనుకుంటారు. తమ స్థోమతకు తగ్గట్లు గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. మారిన కాలానికి అనుగుణంగా పెళ్లి వేడుకల్లో కూడా మార్పులు వచ్చాయి.  

AI Brings Back Deceased Loved Ones in Wedding Videos Emotional Moments Go Viral details in telugu VNR
Wedding

ముఖ్యంగా ఫొటో షూట్స్‌లో సరికొత్త ట్రండ్‌ వచ్చింది. సినిమా పాటలను తలదన్నేలా ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్‌ను నిర్వహిస్తున్నారు. రకరకాల లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌కి సంబంధిచిన వీడియోలను పెళ్లి వేడుకల్లో డిస్‌ప్లే చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్‌లా మారింది. వివాహ వేడుక ముగిసిన తర్వాత బంధువలంతా కుర్చీల్లో కూర్చోగా వీడియోలను ప్లే చేస్తున్నారు. 


AI Video

అయితే ఇప్పుడు ఇందులో కూడా మరో కొత్త పంథాను అవలంబిస్తున్నారు నిర్వాహకులు. పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించిన వారుంటే వారిని రీక్రియేట్‌ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో అచ్చంగా వారి రూపాన్ని పోలిన వ్యక్తిని సృష్టిస్తున్నారు. అచ్చంగా వారు పెళ్లికి హాజరైనట్లు, కొత్త జంటను ఆశీర్వదిస్తున్నట్లు వీడియోలను రూపొందిస్తున్నారు. 

AI Video

ఎమోషనల్‌గా మారుతోన్న పెళ్లి వేడుకలు: 

అకాల మరణంతో ఈ లోకాన్ని వదిలి వెళ్లిన వారు తిరిగి తమ మధ్య ఉన్నట్లు కనిపించడం నిజంగానే ఒక గొప్ప భావోద్వేగ క్షణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెళ్లి వేడుకల సమయంలో ఇలాంటి వీడియోలను ప్లే చేయడంతో బంధువులందరూ ఎమోషనల్‌ అవుతున్నారు. కంటతడి పెడుతూ, తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఇంత గొప్పగా ఉపయోగించుకోవడం నిజంగా అద్భుతం అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. 

Latest Videos

vuukle one pixel image
click me!