ఇండోర్, మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరుంది. ఇక్కడ రాజ్‌వాడ, లాల్ బాగ్ ప్యాలెస్, ఖజరానా గణేష్ టెంపుల్, పాతాళపాని జలపాతం, రాలమండల్ వంటి ప్రదేశాలు ఉన్నాయి. వాటిని తప్పకుండా సందర్శించాల్సిందే.
సూరత్, గుజరాత్
వజ్రాల రాజధానిగా పేరున్న సూరత్ అందమైన నగరం. ఇక్కడ చూడటానికి చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి, డుమాస్ బీచ్, హజీరా బీచ్, సువాలి బీచ్, ఇస్కాన్ టెంపుల్ మొదలైనవి అందరినీ ఆకర్షిస్తున్నాయి.
నవీ ముంబై, మహారాష్ట్ర
సంపన్నులు, కార్పొరేట్ కార్యాలయాలకు కేంద్రం నవీ ముంబై. ముంబైకి సమీపంలోనే ఉంటుంది. ముంబైతో పోలిస్తే చాలా పరిశుభ్రంగా ఉంటుంది. బహుళ అంతస్తుల భవనాలు, పార్కులు, కార్పొరేట్ కార్యాలయాలు, అంతటా పచ్చదనం.. ఈ నగరం ప్రత్యేకతలు.
అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్‌లో అత్యంత పరిశుభ్రమైన పట్టణం అంబికాపూర్. ఇక్కడ సందర్శనీయ ప్రదేశాలు కూడా ఎక్కువే. చూడటానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో మహా మాయ టెంపుల్, మెయిన్‌పాట్ హిల్ స్టేషన్, కైలాష్ గుఫా, థిన్‌థిని రాయి, సర్గుజా ప్యాలెస్ ప్రధానంగా చెప్పుకోదగ్గవి.
మైసూర్, కర్ణాటక
దసరా ఉత్సవాలకు ప్రసిద్ధమైన నగరం మైసూర్. కర్ణాటకలో చూడదగ్గ ఒక మంచి నగరం. ఇక్కడ మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్, బృందావన్ గార్డెన్, జగన్మోహన్ ప్యాలెస్ వంటి ప్రదేశాలు ఉన్నాయి. పరిశుభ్రతకు ఈ పట్టణం పేరుగాంచింది.
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ కొలువైన కనకదుర్గమ్మ గుడి చాలా ఫేమస్. ఈ పట్టణం ఏపీ రాజధానిగా అయ్యాక చాలా మార్పులు వచ్చాయి.
అహ్మదాబాద్, గుజరాత్
అహ్మదాబాద్ పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందింది. ఇది గుజరాత్లోనే అది పెద్ద నగరం. ఇక్కడ చూడటానికి చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. టెక్స్టైల్, ఇతర పరిశ్రమలు ఎన్నో ఉన్నా.. నిర్వహణ సరిగా ఉండటంతో పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా నిలిచింది.
న్యూఢిల్లీ
దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో చూడటానికి చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. పార్లమెంట్ భవనం, కుతుబ్ మీనార్.. ఇలాంటి ఎన్నో ఆకర్షణలు ఈ నగరంలో ఉన్నాయి. రోడ్లు విశాలంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే కాలుష్యం ఈ నగరానికి ఉన్న ప్రధాన సమస్య.