Ayodhya: అయోధ్య వెళ్తే ఈ 10 అద్భుతమైన ప్రదేశాలు తప్పక చూడండి
Ayodhya: శ్రీరాముడి జన్మస్థలంగా భావించే అయోధ్య వెళ్తున్నారా? అయితే ముఖ్యమైన దేవాలయాలు, చూడదగ్గ ప్రదేశాలు అక్కడ చాలా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. తప్పకుండా చూసి రండి.
Ayodhya: శ్రీరాముడి జన్మస్థలంగా భావించే అయోధ్య వెళ్తున్నారా? అయితే ముఖ్యమైన దేవాలయాలు, చూడదగ్గ ప్రదేశాలు అక్కడ చాలా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. తప్పకుండా చూసి రండి.
రామ మందిరం
ఉత్తరప్రదేశ్ అయోధ్య ఇప్పుడు దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయింది.ఇటీవల రామ మందిరం కట్టిన తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు రావడం ప్రారంభించారు. ఈ రామ మందిరం హిందువుల భక్తికి, విశ్వాసానికి చిహ్నంగా నిలుస్తోంది. అసలు అయోధ్య వెళ్లేదే రామ మందిరం చూడటానికి కాబట్టి ముందుగా శ్రీరాముడిని దర్శించుకోండి. సుందరంగా నిర్మించిన రామ మందిరాన్ని దర్శించండి.
హనుమాన్ గర్హి
తర్వాత హనుమాన్ గర్హి మందిరాన్ని దర్శించండి. ఇది కొండ పైన ఉంటుంది. ఇక్కడి నుంచి అయోధ్య నగరం చాలా అందంగా కనిపిస్తుంది.
రామ్ కి పౌడి
రామ్ కి పౌడి అనేది అయోధ్యలోని సరయు నది ఒడ్డున ఉన్న ఘాట్ల వరుస. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.రామ మందిరానికి వెళ్లే ముందు లేదా చివరిలో అయినా ఈ ఘాట్ వద్ద స్నానం చేయండి.
కనక్ భవన్
అయోధ్యలో ఉన్న ఈ కనక్ భవన్ లో రాముడు, సీతాదేవి విగ్రహాలు ఉన్నాయి. మీరు అయోధ్యకు వెళ్తే తప్పకుండా వాటిని చూడండి.
త్రేతా కే ఠాకూర్
త్రేతా కే ఠాకూర్ అనేది ఒక ముఖ్యమైన భవనం. రాముడు త్రేతాయుగానికి చెందిన వాడు కాబట్టి ఇది ఆ కాలానికి చెందిన నిర్మాణం అని తెలియజెప్పేదిగా మిగిలిందని భక్తులు చెబుతారు.
ఇది కూడా చదవండి ప్రపంచంలో సంతోషకర దేశాల లిస్టులో ఇండియా స్థానమెంతో తెలుసా?
సీతమ్మ వారి వంటగది
ఇక్కడ కనిపిస్తున్న భవనాన్ని సీతమ్మ వారి వంటగది అని భక్తులు నమ్ముతారు. ఇక్కడ పిండి రుబ్బే బండ, గరిటెలు ఇంకా చాలా వంట సామాన్లు ఉన్నాయి. ఇవన్నీ త్రేతాయుగం నాటికి చెందినవని భక్తుల విశ్వాసం.
మణి పర్వతం
అయోధ్యలోని కామీ గంజ్ లో మణి పర్వతం ఉంది. ఇది సముద్ర మట్టానికి 65 అడుగుల ఎత్తులో ఉంటుంది.ఈ ప్లేస్ కి మీరు వెళ్లగానే అద్భుతమైన అనుభూతిని పొందుతారు.
నాగేశ్వరనాథ్ మందిరం
నాగేశ్వరనాథ్ మందిరం శివుడికి సంబంధించిన ముఖ్యమైన దేవాలయం. ఇది కూడా రామ మందిరంలా ఒక అద్భుతమైన నిర్మాణం.
గులాబ్ బాడీ
నవాబ్ షుజా-ఉద్-దౌలా సమాధి ఉన్న అందమైన ఉద్యానవనం ఇది. ఇక్కడ పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం మీ ప్రయాణ అలసటను తీర్చేస్తుంది.
దేవకాళి మందిరం
ఇది అయోధ్యలో కొత్త ఘాట్ దగ్గర ఉంది. ఈ గుడిలో దేవకాళి అమ్మవారి విగ్రహం ఉంటుంది. దీన్ని దశరథ మహారాజు సీతాదేవి కోసం కట్టించాడని చెబుతారు.