Cleanest Cities పరిశుభ్రత అంటే ఈ నగరాలదే.. మనకూ చోటుందా మరి?

పరిశుభ్రంగా ఉంటే నగరాలు అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. అలా ఉంటే ఎవరైనా అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకోవాలనుకుంటారు. మరి 2025 నాటికి భారతదేశంలోని పరిశుభ్రమైన నగరాలు ఏంటో మీకు తెలుసా? మన దేశంలో చూడటానికి చాలా అందమైన నగరాలున్నాయి. మధ్యప్రదేశ్ నుండి గుజరాత్ వరకు ప్రతి ప్రదేశానికి దాని ప్రత్యేక ఆకర్షణ ఉంది. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం!

Top 10 cleanest cities in india to visit in 2025 in telugu
ఇండోర్, మధ్యప్రదేశ్

ఇండోర్ మధ్యప్రదేశ్‌లో ఉంది. అక్కడ వీధులు, రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయి. రాజ్‌వాడ, లాల్ బాగ్ ప్యాలెస్, ఖజరానా గణేష్ టెంపుల్, పాతాళపాని జలపాతం, రాలమండల్ వంటి చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి.

Top 10 cleanest cities in india to visit in 2025 in telugu
సూరత్, గుజరాత్

డైమండ్ సిటీగా పేరున్న సూరత్‌లో కూడా పరిశుభ్రత ఎక్కువే. చూడటానికి చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి, డుమాస్ బీచ్, హజీరా బీచ్, సువాలి బీచ్, ఇస్కాన్ టెంపుల్ మొదలైనవి.


నవీ ముంబై, మహారాష్ట్ర

మురికివాడల నిలయమైన ముంబయి పక్కనే ఉన్న నగరం నవీ ముంబై. ఈ కొత్త నగరం మాత్రం సరికొత్తగా, పరిశుభ్రంగా ఉంటుంది.  వ్యాపారవేత్తలు, ధనికులు ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతుంటారు. చాలా సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ నగరం పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందింది.

అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్

అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్‌లో చూడటానికి చాలా అందమైన పట్టణం. మహా మాయ టెంపుల్, మెయిన్‌పాట్ హిల్ స్టేషన్, కైలాష్ గుఫా, థిన్‌థిని రాయి, సర్గుజా ప్యాలెస్ ఇక్కడ ఉన్నాయి. రోడ్లపై చెత్తాచెదారం అన్నదే కనిపించదు.

మైసూర్, కర్ణాటక

దసరా ఉత్సవాలకు పేరు గాంచిన నగరం మైసూర్. ఇది కర్ణాటకలో చూడటానికి ఒక మంచి ప్రదేశం. ఇక్కడ మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్, బృందావన్ గార్డెన్, జగన్మోహన్ ప్యాలెస్ వంటి చాలా ప్రదేశాలు ఉన్నాయి. రోడ్లు శుభ్రంగా ఉంటాయి.

విజయవాడ, ఆంధ్రప్రదేశ్

విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఏపీ రాజధాని కూడా. ఈమధ్యకాలంలో బాగా మెరుగవుతోంది. కనకదుర్గ గుడి, ప్రకాశం బ్యారేజీలాంటి ఎన్నో సందర్శనీయ స్థలాలున్నాయి.

అహ్మదాబాద్, గుజరాత్

 గుజరాత్లోని అతిపెద్ద నగరం అహ్మదాబాద్.  పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చూడటానికి చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇది గుజరాత్ వ్యాపార రాజధాని. టెక్స్టైల్, డైమండ్ ఇతర పరిశ్రమలు ఉన్నా.. నిర్వహణ బాగుండటంతో అందంగా, శుభ్రంగా ఉంటుంది.

న్యూఢిల్లీ

న్యూఢిల్లీ, భారత దేశ రాజధాని. రోడ్లు విశాలంగా, శుభ్రంగా ఉన్నా.. ఇక్కడ కాలుష్యం ఎక్కువ. పాార్లమెంట్, కుతుబ్ మీనార్ లాంటి ఎన్నో చారిత్రక, సందర్శనీయ ప్రాంతాలున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఐటీ, కార్పొరేట్ సంస్థలకు నిలయం. ఆధునికంగా, పరిశుభ్రంగా ఉండే ఈ ప్రాంతాలు పాశ్చాత్య దేశాలను తలపిస్తుంటాయి.

చంద్రపూర్, మహారాష్ట్ర

చంద్రపూర్, మహారాష్ట్రలో ఉన్న ఒక నగరం. ఇక్కడి మహాకాళి టెంపుల్ చాలా ఫేమస్. ఖర్గోన్, మధ్యప్రదేశ్‌లో చూడటానికి చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి శుభ్రమైన వాతావరణం దీనిని మరింత ప్రత్యేకంగా నిలుపుతోంది.

Latest Videos

vuukle one pixel image
click me!