చారిత్రక, పురాతన కట్టడాలు
తాజ్ మహల్, ఆగ్రా, ఉత్తరప్రదేశ్
ఈ తెల్ల పాలరాతి కట్టడాన్ని షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం కట్టించాడు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ప్రేమకు చిహ్నంగా కూడా భావించే తాజ్ మహల్ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని ప్రతి ప్రేమికులు తహతహలాడుతుంటారు.
స్వర్ణ దేవాలయం, అమృత్‌సర్
దీన్ని హర్‌మందిర్ సాహిబ్ అని కూడా అంటారు. ఈ సిక్కు దేవాలయం ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి. ప్రతి సిక్కు దీన్ని పవిత్ర దేవాలయంగా భావిస్తుంటాడు.
మీనాక్షి టెంపుల్, మధురై
ఈ గుడిని మీనాక్షి (పార్వతి), సుందరేశ్వరుడు (శివుడు)కి అంకితం చేశారు. ఇది దక్షిణభారత దేశంలోని ముఖ్యమైన గుళ్లలో ఒకటి. అతి ప్రాచీనమైంది. అపురూపమైన వాస్తు సంపద దీని సొంతం.
కుతుబ్ మీనార్, ఢిల్లీ
73 మీటర్ల ఎత్తు ఉండే ఈ మీనార్ ఇండియాలో ఎత్తైన ఇటుకల టవర్. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ 1193లో మొదలుపెట్టాడు, ఇల్తుత్‌మిష్ పూర్తి చేశాడు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉంటుంది.
హవా మహల్, జైపూర్
హవా మహల్ అంటే 'గాలి మేడ'. ఈ కట్టడంలో 953 చిన్న కిటికీలు ఉన్నాయి. గాలి వచ్చేలా వీటిని తయారు చేశారు. రాజస్థాన్ వెళ్లే ప్రతి పర్యాటకుడు హవా మహల్ ని సందర్శిస్తుంటారు.
సాంచి స్థూపం, సాంచి
సాంచి స్థూపం ఇండియాలో చాలా పాత బౌద్ధ కట్టడాల్లో ఒకటి. ఇది మధ్యప్రదేశ్‌లోని రాయ్‌సేన్ జిల్లాలో ఉంది. ఇది యునెస్కో వారసత్వ గుర్తింపు కట్టడాల్లో ఒకటిగా నిలిచింది.
చార్మినార్, హైదరాబాద్
1591లో సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా దీన్ని కట్టించాడు. చార్మినార్ హైదరాబాద్ చరిత్రకు, నిర్మాణానికి గుర్తుగా భావిస్తుంటారు. అన్ని మతాల వారు చార్మినార్ని సందర్శిస్తుంటారు.
అజంతా, ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర
అజంతా, ఎల్లోరా గుహలు ఇండియాలో చాలా పాత కాలం నాటి కట్టడాలు. ఇవి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి.
మైసూర్ ప్యాలెస్, మైసూర్
మైసూర్ ప్యాలెస్ ఇండియాలో చాలా అందమైన ప్యాలెస్‌లలో ఒకటి. ఇది కర్ణాటకలోని మైసూర్ నగరంలో ఉంది.
కోణార్క్ సూర్య దేవాలయం, ఒడిశా
ఈ గుడి సూర్య భగవానుడికి అంకితం చేశారు. దీన్ని బ్లాక్ పగోడా అని కూడా అంటారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్.