IRCTC Tour Package: తక్కువ ఖర్చులో బ్యాంకాక్ వెళ్లడానికి ఇది బెస్ట్ ఆప్షన్!

Published : Mar 24, 2025, 04:36 PM IST

IRCTC ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తూ అందరినీ ఆకర్షిస్తోంది. తక్కవ బడ్జెట్ లో విదేశాలు చుట్టిరావడానికి స్పెషల్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం అతి తక్కువ ఖర్చులో థాయ్ లాండ్ చూడటానికి అవకాశం కల్పిస్తోంది. ప్యాకేజీ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
IRCTC Tour Package: తక్కువ ఖర్చులో బ్యాంకాక్ వెళ్లడానికి ఇది బెస్ట్ ఆప్షన్!

టూరిస్టుల కోసం IRCTC ఎప్పటికప్పుడు రకరకాల టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. థాయ్‌లాండ్‌కి తక్కువ ధరలో అదిరిపోయ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. తక్కువ ఖర్చులో బ్యాంకాక్ వెళ్లడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

25
4 రోజుల ట్రిప్..

ఈ ట్రిప్ నాలుగు రోజులు, మూడు రాత్రులు ఉంటుంది. ఎక్స్‌ట్రా ఛార్జీలు లేకుండా బస, భోజనం అన్నీ కలిపే ఉంటాయి. ఈ ట్రిప్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రారంభమవుతుంది.

35
3 స్టార్ హోటల్

ట్రావెలర్స్ అల్కాజర్ షో, కోరల్ ఐలాండ్ టూర్, సఫారి వరల్డ్, మెరీన్ పార్క్, బ్యాంకాక్, పట్టాయలోని వాట్ ట్రిమిట్ లాంటి ఫేమస్ ప్లేసెస్‌కి తీసుకెళ్తారు. ప్యాకేజీలో భాగంగా టూరిస్టులు కంఫర్టబుల్ 3 స్టార్ హోటల్స్‌లో బస చేస్తారు. ప్యాకేజీలో భాగంగా వారికి బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ ఏర్పాటు చేస్తారు.

45
ప్యాకేజీ ధర?

ఈ ప్యాకేజీ ధర రకరకాల ట్రావెల్ ఆప్షన్స్‌కి తగ్గట్టు ఉంటుంది. సింగిల్​గా ట్రావెల్ చేసేవాళ్లు రూ. 54,600 పే చేయాలి. డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్ రూమ్స్ తీసుకునేవాళ్లకి ఒక్కొక్కరికి రూ. 47,580 ఛార్జ్ చేస్తారు. ఈ ట్రిప్ కోసం IRCTC అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

55
తక్కువ ఖర్చుతో..

తక్కువ ఖర్చుతో కూడిన ట్రావెల్ ఆప్షన్స్‌ని స్టార్ట్ చేయడం ద్వారా ఐఆర్‌సిటిసి ఇండియన్ టూరిస్టులకి ఇంటర్నేషనల్ ట్రావెల్‌ని ఈజీ చేస్తోంది. డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండానే ప్రపంచంలోని పలు దేశాలను చూడటానికి వాళ్లని ఎంకరేజ్ చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories