భారతీయ రైల్వే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజు కొన్ని లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ ఉంటుంది. ఇటీవల రైల్వేలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్యాసింజర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైల్వే చాలా ఉచిత సౌకర్యాలను కల్పిస్తోంది. చాలామందికి ఈ విషయం తెలియక ఇబ్బంది పడుతుంటారు. మరి రైల్వేలో ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయో వాటిని ఎలా వాడుకోవాలో ఇక్కడ చూద్దాం.
ఉచితంగా దిండు, దుప్పటి
ఇండియన్ రైల్వేలో చాలా రకాల కోచ్ లు, తరగతులు ఉంటాయి. వీటిలో ఏసీ కోచ్ ఒకటి. ఈ కోచ్ లో జర్నీ చేసే ప్యాసింజర్స్ కి ఫ్రీగా బెడ్‌రోల్ ఇస్తారు. అంటే ఒక దిండు, దుప్పటి ఇస్తారు. మనం ప్రత్యేకంగా ఇంటి దగ్గరి నుంచి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు.