రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్‌పై 50 శాతం డిస్కౌంట్. ఎవరికో తెలుసా?

Published : Apr 07, 2025, 06:00 PM IST

Discount on Train Tickets: ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్స్ బుక్ చేసుకొనే వారు ఇప్పుడు టికెట్ ధరలో 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఐఆర్‌సీటీసీ తన కస్టమర్ల కోసం ఎన్నో రాయితీలు ప్రకటిస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రత్యేకమైన ఆఫర్ ఎవరికి వర్తిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.   

PREV
15
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్‌పై 50 శాతం డిస్కౌంట్. ఎవరికో తెలుసా?

రెగ్యులర్ గా రైళ్లలో ప్రయాణించే వారికి ఐఆర్‌సీటీసీ అనేక సదుపాయాలు కల్పిస్తూ ఉంటుంది. కొన్ని ప్రత్యేక మార్గాల్లో ప్రయాణించే వారికి టికెట్ ధరల్లో తగ్గింపు కూడా అందిస్తుంది. ఐఆర్‌సీటీసీలో సుబ్ యాత్ర, భారత్ దర్శన్ వంటి పథకాలు కూడా ఉన్నాయి. ఇవి దేశంలో వివిధ ప్రాంతాలను చూడాలనుకొనే వారికి ఉపయోగకరంగా ఉంటాయి. 
 

25

ఇలాంటి అనేక పథకాలను ఐఆర్‌సీటీసీ అందిస్తుంది. వీటిని బుక్ చేసుకొనే వారికి ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తుంది. పండగలు, వేసవి సెలవులు, ఇతర సెలవుల నేపథ్యంలో తక్కువ ధరకే టికెట్స్ విక్రయిస్తుంది. అవి 10 శాతం, 20 శాతం ఉంటాయి. అయితే ఇప్పుడు ఐఆర్‌సీటీసీ 50 శాతం రాయితీతో టికెట్లను అందిస్తోంది. అది ఎవరికో ఇప్పుడు తెలుసుకుందాం. 

35

ఐఆర్‌సీటీసీ విద్యార్థుల కోసం ప్రత్యేక రాయితీ టికెట్లను అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఏ మార్గంలో అయిన బేసిక్ టికెట్ ఛార్జీపై విద్యార్థులకు  ఏకంగా 10 నుంచి 50 శాతం రాయితీని అందిస్తోంది. అయితే టికెట్ బుక్ చేసేటప్పుడు విద్యార్థులు తప్పకుండా తమ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. 
 

45

ఐఆర్‌సీటీసీ అందిస్తున్న 50 శాతం రాయితీని విద్యార్థులు పొందాలంటే వారికి కొన్ని అర్హతలు ఉండాలి. అవేంటంటే.. విద్యార్థుల వయసు కచ్చితంగా 12 సంవత్సరాల నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి.  ఈ రాయితీ టికెట్ పొందడానికి, టికెట్ బుక్ చేసేటప్పుడు వారి గుర్తింపు కార్డును చూపించాలి.
 

ఇది కూడా చదవండి తక్కువ ఖర్చుతో హనీమూన్ వెళ్లడానికి బెస్ట్ సిటీస్ ఇవిగో

55

ఐఆర్‌సీటీసీ విద్యార్థులకే కాకుండా ఇతర ప్రయాణికులకు కూడా ప్రత్యేకమైన పథకాలు అందిస్తోంది. ఇవి మంచి డిస్కౌంట్ తో లభిస్తాయి. అంతేకాకుండా రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, ఉచిత భోజన సౌకర్యం వంటి ఆఫర్లు కూడా లభిస్తాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్లు ప్రయాణ బోగీ, క్లాస్ బట్టి మారుతూ ఉంటాయి. 

120 రోజుల ముందు బుక్ చేసుకుంటే 12% వరకు తగ్గింపు ఉంటుంది.
60 రోజుల ముందు బుక్ చేసుకుంటే 10% వరకు తగ్గింపు ఉంటుంది. ఈ తగ్గింపు అన్ని రకాల ప్రయాణాలకు వర్తిస్తుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories