భారతీయ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ లలో నాలుగో స్థానంలో ఉంది. ప్రతిరోజూ వందాలది రైళ్లు లక్షలాది మందిని తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుస్తాయి. సుమారు 140 కోట్లు ఉన్న ఇండియాలో ఇంత పకడ్బందీగా ఒక వ్యవస్థ నడవడం అంటే మాటలు కాదు. సాధారణ ప్యాసింజర్ రైళ్ల నుండి వందే భారత్ వంటి హై స్పీడ్ లగ్జరీ రైళ్ల వరకు రకరకాల ట్రైన్స్ నిత్యం తిరుగుతూ ఉంటాయి.
ఇన్ని రైళ్లు ఉండటం వల్ల చాలా ట్రైన్స్ లో ప్యాంట్రీ కార్లు(క్యాటరింగ్) ఉంటాయి. ఆయా ట్రైన్స్ లో ప్రయాణించే వారికి అక్కడి నుంచే ఫుడ్ డెలివరీ అవుతుంది. అందువల్ల ప్రయాణీకులు ఎప్పుడు కావాలన్నా కావాల్సిన టిఫెన్స్, మీల్స్, స్నాక్స్, టీ, కాఫీ లభిస్తాయి. మీరు కావాలంటే IRCTC ద్వారా మీకు ఇష్టమైన రెస్టారెంట్ల నుండి ఆహారాన్ని ఆర్డర్ చేస్తే, మీ సీటు వద్దకే వారు డెలివరీ చేస్తారు.
రైళ్లలోని ప్యాంట్రీ కార్లలో లభించే ఆహార పదార్థాలను డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. లేదా స్టేషన్లలో ఆగినప్పుడు ప్లాట్ ఫారంపై ఉన్న దుకాణాల్లో మీకు నచ్చిన ఆహార పదార్థాలు కొనుక్కోవచ్చు. అయితే ఇవన్నీ డబ్బులు చెల్లిస్తేనే లభిస్తాయి. కాని ఇండియాలో నడుస్తున్న ఓ రైలులో మాత్రం డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా టిఫెన్స్, మీల్స్, స్నాక్స్ ఉచితంగా అందిస్తున్నారు. ఆ ట్రైన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు
ఆ ట్రైన్ పేరు సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది అమృత్సర్, నాందేడ్ మధ్య నడుస్తుంది. ఈ రైలు మొత్తం 39 స్టేషన్లలో ఆగుతుంది. 33 గంటల్లో 2081 కి.మీ. దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలులో ప్రయాణించే ప్రయాణీకులు గత 29 సంవత్సరాలుగా టిఫెన్స్, మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం మూడు పూటలా ఉచితంగా సరఫరా చేస్తున్నారు. మీరు గాని ఈ రైలులో ప్రయాణిస్తే ఎలాంటి ఆహారం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
6 స్టేషన్లలో ఉచిత ఆహారం పంపిణీ
అమృత్‌సర్-నాందేడ్ మధ్య తిరిగే ఈ ఎక్స్‌ప్రెస్ రైలు 39 స్టేషన్లలో ఆగుతుంది. అయితే 6 స్టేషన్లలో ఉచిత ఆహారాన్ని అందిస్తారు. అయితే ప్రయాణికులు ఎవరి ప్లేట్లు వారే తీసుకెళ్లాలి. జనరల్ కోచ్‌ల నుండి ఏసీ కోచ్‌ల వరకు ప్రయాణీకులందరూ కూడా తమ సొంత పాత్రలను తీసుకెళ్లి ఉచిత భోజనాన్ని పొందవచ్చు.
గురుద్వారాల సేవాభావం
న్యూఢిల్లీ, దాబ్రా స్టేషన్లలో ఉచిత ఆహారం పంపిణీ చేస్తారు. ఇందులో రైస్, శనగలు, పప్పులు, కిచిడి, బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, ఇతర కూరగాయలు వంటి పోషకమైన ఆహారాలు వేడిగా తయారు చేసి వడ్డిస్తారు. ప్రతిరోజూ వేర్వేరు కూరలు తయారు చేసి వడ్డిస్తారు. ఈ ఉచిత భోజనాలను గురుద్వారాలు అందిస్తున్నాయి. ఈ ఆహార ఖర్చులను గురుద్వారాలు స్వీకరించే విరాళాల ద్వారా భరిస్తారు.
ఇది కూడా చదవండి రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్‌పై 50 శాతం డిస్కౌంట్. ఎవరికో తెలుసా?