2 నిమిషాల్లో ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి! సీక్రెట్ ట్రిక్స్ ఇవిగో

Published : May 01, 2025, 05:29 PM IST

Confirmed Train Ticket: అర్జెంట్ గా ఊరెళ్లాలి.. రైలులో బెర్త్‌లు ఫుల్ అయిపోయాయి.. వెయిటింగ్ లిస్టేమో పెద్దగా ఉంది. ఇలాంటి సమయంలో చాలా మంది ఖరీదైన ఫ్లైట్ లేదా ఇతర ఆప్షన్స్ కోసం చూస్తారు. కానీ మీరు ఈ ట్రిక్స్ పాటించారంటే కన్ఫర్మ్ టికెట్ దొరకడం ఖాయం. అవేంటో తెలుసుకుందాం రండి.   

PREV
15
2 నిమిషాల్లో ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి! సీక్రెట్ ట్రిక్స్ ఇవిగో

1. IRCTC సూపర్ ఫీచర్ వాడండి

IRCTC వెబ్సైట్ లో ఒక సూపర్ ఫీచర్ ఉంది. కాని చాలా మంది దాన్ని పట్టించుకోరు. దాని పేరు 'ఆల్టర్నేట్ ట్రైన్ అకామిడేషన్' (Alternate Train Accommodation) లేదా 'వికల్ప్ పథకం' (Vikalp Scheme). మీరు వెయిటింగ్ టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు ఈ ఆప్షన్ ఆన్ చేస్తే కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. ఈ ఫీచర్ అదే రూట్ లో వేరే రైలులో కన్ఫర్మ్ సీట్ వచ్చేలా చేస్తుంది. 

25

2. రియల్ టైం అవైలబిలిటీ 

టికెట్ బుక్ చేసేటప్పుడు సీట్ దొరకకపోతే ఒక చిన్న ట్రిక్ ఉంది. రాత్రి 11 నుండి 12 గంటల మధ్య టికెట్ బుక్ చేయటానికి ప్రయత్నించండి. ఈ సమయంలో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. సిస్టమ్ ఫాస్ట్ గా పనిచేస్తుంది.

35

3. రిమోట్ లొకేషన్ కోటా

మీరు చిన్న స్టేషన్ నుండి బుకింగ్ చేస్తే సీట్ దొరికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే పెద్ద స్టేషన్ కంటే 1-2 స్టాప్స్ ముందు గాని, వెనక స్టేషన్ నుంచి టికెట్ బుకింగ్ చేస్తే సీట్ దొరికే అవకాశం పెరుగుతుంది. ఉదాహరణకు విజయవాడ నుండి చెన్నై వెళ్లాలంటే గుంటూరు నుంచి టికెట్ బుక్ చేస్తే త్వరగా కన్షర్మ్ అవుతుంది. 

45

4. తత్కాల్ టికెట్ బుకింగ్ ట్రిక్

తత్కాల్ టికెట్ బుక్ చేయడం కష్టం. 'Tatkal for Sure' లేదా 'Magic Autofill' లాంటి ఆటో ఫిల్ ఎక్స్‌టెన్షన్స్ గూగుల్ క్రోమ్ లో ఆప్షన్స్ వాడండి. అన్ని వివరాలు ముందే నింపి, సమయం అయ్యేసరికి ఒక క్లిక్ తో సబ్మిట్ చేయండి. దీంతో టికెట్ కన్షర్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 

55

5. టికెట్ కన్ఫర్మ్ అవుతుందా?

ConfirmTkt, RailYatri యాప్స్ ఉపయోగించి టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎంత ఉందో ముందే చూడొచ్చు. వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్, ఆల్టర్నేటివ్ రైళ్ల సమాచారం కూడా వీటిల్లో దొరుకుతుంది.

6. TTE దగ్గర కూడా ప్రయత్నించండి

టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ప్రయాణం రోజు స్టేషన్ కి వెళ్లి, చార్ట్ తయారైన తర్వాత TTE ని కలవండి. కొన్నిసార్లు ఖాళీ సీట్లు ఉంటాయి. వాటిని స్టేషన్ లో బోర్డింగ్ చేసేవారికి ఇస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories