ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది?
రైలు ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకమే. కిటికీలోంచి కనిపించే ప్రకృతి దృశ్యాలు, ఊరూరి కథలు చాలా ఆసక్తిగా జర్నీ సాగుతుంది. అలాంటిది 21 రోజుల పాటు 13 దేశాలు చుట్టే రైలు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి.
ఈ చారిత్రాత్మక రైలు ప్రయాణం పోర్చుగల్ దేశంలోని లాగోస్ నుండి ప్రారంభమై సింగపూర్‌లో ముగుస్తుంది. స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాల గుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది.