1. చౌక టికెట్ కి అదే సరైన సమయం
ఉదయం వేళల్లో విమానాలకు డిమాండ్ తక్కువగా ఉంటుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ సమయంలో టికెట్లు బుక్ చేస్తే తక్కువ ధరలో దొరుకుతాయి. ఉదయం 4-6 గంటల మధ్య ఎయిర్‌లైన్స్ సీట్లు నింపడానికి డిస్కౌంట్ ఇవ్వొచ్చు. అర్ధరాత్రి (Midnight Booking) రాత్రి 12 నుండి 2 గంటల వరకు టికెట్ బుక్ చేస్తే వెబ్‌సైట్‌పై ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, ఇంకా ఎయిర్‌లైన్స్ చాలాసార్లు మిగిలిన టికెట్లను తక్కువ ధరకే విడుదల చేస్తాయి.
2. ఫలానా రోజుల్లో
మంగళవారం (Tuesday), బుధవారం (Wednesday) రోజుల్లో టికెట్ బుక్ చేస్తే ధరలు తక్కువగా ఉంటాయి. వారాంతాల్లో (Weekends), సెలవుల్లో (Holidays) టికెట్లు రేటు పెరుగుతాయి, ఎందుకంటే ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుంది.
3. ఎక్కువ రోజులు ముందు చేస్తే..
దేశీయ విమానాలకు 3 నుండి 6 వారాల ముందు, అంతర్జాతీయ విమానాలకు 2 నుండి 3 నెలల ముందు బుక్ చేసుకోవాలి. ఈ సమయంలో ఎయిర్‌లైన్స్ ఎక్కువ డిస్కౌంట్ ఇస్తాయి. అప్పటికి బుక్ చేసే వారు ఇంకా పూర్తిగా సిద్ధమై ఉండరు. మీకు తక్కువలో దొరుకుతుంది.
4. విమాన టికెట్ కోసం ఏ యాప్స్, ట్రిక్స్ వాడాలి?
Google Flights, Skyscanner, Hopper, MakeMyTrip వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ధర తక్కువగా ఉన్నప్పుడు తెలియజేసేలా అలర్ట్ పెట్టుకోండి. Incognito Modeలో సెర్చ్ చేయండి, దీనివల్ల ధర ట్రాకింగ్ జరగదు. క్యాష్‌బ్యాక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్‌లను చెక్ చేయండి. కొన్నిసార్లు అదనపు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది.
5. అపోహలు వద్దు..
వెనుక సీటు (Back Row) లేదా విండో (Window) సీటు ఎప్పుడూ ఎక్కువ ధర ఉండదు. ఎయిర్‌లైన్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా సీటును కేటాయిస్తుంది, కానీ టికెట్ ధర మీ తేదీ, సమయం, డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది. సో.. వీటిపై అపోహలు వీడండి.