Best Countries for Indian Students చదువు, ఉద్యోగం.. రెండూ కావాలా? అయితే ఈ దేశాలకు వెళ్లండి!

Published : Mar 19, 2025, 09:00 AM IST

చదువు, ఉద్యోగం.. ఒక వ్యక్తి జీవితంలో స్థిరపడటానికి ఇవే కీలక అంశాలు. వీటి కోసం చాలామంది దేశం దాటి బయటికి వెళ్లడానికి సిద్ధమవుతుంటారు. ఇలాంటి ఔత్సాహికులకు చాలా దేశాలు ఆహ్వానం పలుకుతుంటాయి. మరి మన దేశంలోని విద్యార్థులు ఏ దేశాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు? అక్కడ ఏమేం అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందామా?  

PREV
17
Best Countries for Indian Students చదువు, ఉద్యోగం.. రెండూ కావాలా? అయితే ఈ దేశాలకు వెళ్లండి!
వెళ్లేముందు ఇవి తెలుసుకోవాలి

చాలామంది విద్యార్థులు పై చదువుల కోసం వేరే దేశం వెళ్లాలని అనుకుంటారు. ఇంజినీరింగ్ లేదా ఇతర డిగ్రీ కోర్సులు అయిపోయాక దానికి రెడీ అవుతారు. సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ వేరే దేశం వెళ్ళాక చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే మనం ఏ దేశానికి వెళ్తున్నామో, అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. 

27
వేరే దేశంలో ఉద్యోగాలు

ఇప్పుడు చాలామంది ఇండియన్స్ ఉన్నత చదువులు చదివి, అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి.  ఫస్ట్ టైం వేరే దేశం వెళ్లాలనుకునే స్టూడెంట్స్ అలాంటి దేశాలు ఎంచుకోవడం మంచిది.

37
అమెరికా, జర్మనీ

ఇండియన్ స్టూడెంట్స్ కలల దేశం అమెరికా. ఇక్కడ నుండి చాలామంది పై చదువులకి, ఉద్యోగాలకి అమెరికా వెళ్తున్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో చదవాలని కలలు కంటారు.

జర్మనీలో కూడా చాలామంది ఇండియన్స్ ఉన్నారు. ఇక్కడ ఇంజనీరింగ్, ఐటీ, సైన్స్ రంగాల్లో మంచి ప్రొఫెషనల్స్‌కి మంచి అవకాశాలు ఉన్నాయి.

47
ఆస్ట్రేలియా, కెనడా

ఆస్ట్రేలియాలో కూడా ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్సిటీలు ఉన్నాయి. చాలామంది వేరే దేశాల నుండి పై చదువుల కోసం ఇక్కడకి వస్తారు.

వేరే దేశాలతో పోలిస్తే కెనడా వెళ్లడం చాలా ఈజీ. ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి.

57
యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్

పై చదువుల విషయంలో ప్రపంచంలోనే బ్రిటన్ ముందుంది. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు ఇక్కడే ఉన్నాయి.

సింగపూర్ అంతర్జాతీయ వ్యాపారం, ఫైనాన్స్ కి మెయిన్ సెంటర్. ఈ దేశానికి మంచి ఎకానమీ కూడా ఉంది. మంచి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

67
నెదర్లాండ్, ఫ్రాన్స్

నెదర్లాండ్. ఈ దేశంలో మంచి ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంది. అందుకే ఇక్కడి ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది.

ఫ్రాన్స్ సంస్కృతి, కళ, ఫ్యాషన్ లాంటి రంగాల్లో చాలా కాలంగా ఫేమస్. ఈ రంగాల్లో ఎడ్యుకేషన్‌కి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారు.

77
ఐర్లాండ్, న్యూజిలాండ్

ఐర్లాండ్ ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో ఒకటి. ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. టెక్నాలజీ, మెడిసిన్ రంగాల్లో ఉన్నవాళ్లకి ఇక్కడ ఛాన్స్ ఉంది.

న్యూజిలాండ్‌లో చాలామంది ఇండియన్స్ ఉన్నారు. ఈ దేశం ప్రకృతి అందానికి ఫేమస్... లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories