Adventure Destinations ఈ వేసవిలో 6 అడ్వెంచర్ టూర్లు చేస్తారా? ఈ ప్రదేశాలు వెల్ కమ్ అంటున్నాయి

Published : Mar 17, 2025, 09:59 AM IST

వేసవి వచ్చేసింది. ఔత్సాహికులు ఈ సమయంలో అత్యధికంగా టూర్లకు వెళ్తుంటారు. ఇందులోనూ అడ్వెంచర్ కోరుకునేవాళ్లూ ఉంటారు. సాదాసీదాగా కాకుండా.. ప్రతిక్షణాన్ని బాగా ఆస్వాదించాలని వాళ్లు కోరుకుంటారు. అలాంటివాళ్ల కోసం భారత్ లో చాలానే ప్రదేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. అలాంటి సాహస యాత్రకు ఊతమిచ్చే ఆరు అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.

PREV
15
Adventure Destinations ఈ వేసవిలో 6 అడ్వెంచర్ టూర్లు చేస్తారా? ఈ ప్రదేశాలు వెల్ కమ్ అంటున్నాయి
సాహసప్రియుల కోసం..

భారతదేశం సాహస ప్రియులకు ఒక ఆటస్థలం, ఇక్కడ మంచు ప్రదేశాల నుండి సముద్రాల వరకు అన్నీ ఉన్నాయి. మీరు పర్వతారోహణ చేయాలనుకున్నా, నదిలో ప్రయాణించాలనుకున్నా, సముద్రంలో ఈత కొట్టాలనుకున్నా ఏదో ఒకటి మీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ యాత్రను ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరండి!

25

రిషికేశ్, ఉత్తరాఖండ్: ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా రాఫ్టింగ్, బంజీ జంపింగ్ లకు రిషికేశ్ ప్రసిద్ధి. సాహసికులు ఇక్కడికి ప్రతి ఏటా అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. 

35

లేహ్-లడఖ్: ట్రెక్కింగ్, బైకింగ్ అడ్వెంచర్స్ బైకర్లు, ట్రెక్కింగ్ చేసేవాళ్లకి లేహ్-లడఖ్ ఒక అద్భుతమైన ప్రదేశం. బైకర్లు జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ బైక్ రైడింగ్ చేయాలని తహతహలాడుతుంటారు.

45

బిర్ బిల్లింగ్, హిమాచల్ ప్రదేశ్: పారాగ్లైడింగ్ పారడైజ్ ఎగరాలని కలలు కనే వాళ్లకి బిర్ బిల్లింగ్ ఒక స్వర్గధామం. దేశంలోని పారాగ్లైడింగ్ కి అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో ఇది ముందువరుసలో ఉంది. 

అండమాన్ & నికోబార్ దీవులు: స్కూబా డైవింగ్ ఇంకా స్నార్కెలింగ్ అండమాన్ దీవుల్లోని నీరు పగడపు దిబ్బలను చూడటానికి చాలా అనువుగా ఉంటుంది.

55

స్పితి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్: ఆఫ్-రోడింగ్ ఇంకా క్యాంపింగ్ చేసేవాళ్లకి స్పితి వ్యాలీ ఆఫ్-రోడింగ్  ఒక మంచి ప్రదేశం. 

గోవా: వాటర్ స్పోర్ట్స్ గోవా బీచ్‌లు కేవలం విశ్రాంతి కోసమే కాదు - ఇక్కడ చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories