ఇలా చెక్ చేయండి..
ముందుగా.. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఆన్ చేసి, రిమోట్ చివర ఉన్న IR బల్బును కెమెరాకు ఎదురుగా పెట్టాలి. ఇప్పుడు రిమోట్‌లోని ఏదైనా బటన్ నొక్కి చూడాలి. అప్పుడు ఫోన్ స్క్రీన్‌పై ఊదా రంగు లైట్ కనిపిస్తే, రిమోట్ సిగ్నల్ పంపిస్తున్నట్లు అర్థం. అప్పుడు సమస్య టీవీ సెన్సార్‌లో ఉండొచ్చు. లైట్ కనిపించకపోతే, సమస్య రిమోట్‌లోనే ఉన్నట్లు.
అప్పుడు రిమోట్ నుంచి బ్యాటరీలను పూర్తిగా తీసేయాలి. ఆపై, పవర్ బటన్‌ను ఓ 30 సెకన్ల పాటు నొక్కి పట్టుకోవాలి. ఇది లోపల పేరుకుపోయిన అనవసరమైన విద్యుత్ ని బయటకు పంపుతుంది. ఆ తర్వాత కొత్త బ్యాటరీలు వేసి చెక్ చేయాలి. బ్యాటరీలు పెట్టే చోట తుప్పు లేదా మురికి ఉంటే, దాన్ని నెమ్మదిగా శుభ్రం చేయడం ముఖ్యం.
కొన్ని సందర్భాల్లో రిమోట్ బాగానే పనిచేస్తున్నా, టీవీ ముందు ఉన్న ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌ను ఏదైనా వస్తువు మూసివేస్తే సిగ్నల్ అందదు. టీవీ ముందు ఏవైనా వస్తువులు ఉంటే వాటిని తొలగించి మళ్లీ ప్రయత్నించాలి. అలాగే రిమోట్‌ను టీవీ వైపు సరిగ్గా చూపించి ఉపయోగించాలి.