True 5G: ఫోన్‌లో ఫుల్ 5G సిగ్నల్ ఉన్నా ఇంటర్నెట్ రావడం లేదా? అయితే ఇలా చేయండి !

Published : Jun 23, 2026, 07:33 AM IST

How To Fix 5G Data: మీ ఫోన్‌లో ఫుల్ సిగ్నల్ వచ్చినా కొన్ని సార్లు ఇంటర్నెట్ రాదు. అలాగే, ఫుల్ 5G సిగ్నల్ ఉన్నా ఇంటర్నెట్ స్పీడ్ తక్కువ రావడం లేదా బ్రౌజ్ చేస్తుంటే నెట్ తిరుగుతుంది. ఎందుకు ఇలా అవుతుంది? ఈ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకుందాం.

PREV
15
సిగ్నల్ ఏమో ఫుల్.. నెట్ చూస్తే జీరో! మీ 5G ఫోన్‌లో ఇంటర్నెట్ రాకపోవడానికి అసలు కారణాలు ఇవే

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రస్తుతం ఒక వింతైన, విసుగు తెప్పించే సమస్యను ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే.. ఫోన్ స్క్రీన్ పైన చూస్తే ఫుల్ 5G సిగ్నల్ బార్స్ కనిపిస్తాయి. కానీ, ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా లోడ్ అవ్వదు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తిరుగుతూనే ఉంటాయి, యాప్స్ అస్సలు పని చేయవు.

ఈ ప్రాబ్లం ఎవరికైనా, ఎక్కడైనా, ఏ టైమ్‌లోనైనా రావచ్చు. అయితే, ఫోన్‌లో ఫుల్ సిగ్నల్ కనిపించినంత మాత్రాన ఇంటర్నెట్ స్పీడ్‌గా వచ్చేస్తుందని అనుకుంటే పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక నెట్‌వర్క్ కంజెషన్, క్యారియర్ గ్లిచెస్, సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్, ఫోన్ సెట్టింగ్స్ తప్పుగా ఉండటం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి.

25
ఫుల్ 5G సిగ్నల్ ఉన్నా నెట్ ఎందుకు రాదు?

చాలామంది యూజర్లు తమ ఫోన్‌లో 5G ఐకాన్, ఫుల్ సిగ్నల్ బార్స్ కనిపిస్తే సూపర్ స్పీడ్ ఇంటర్నెట్ వచ్చేస్తుందని ఫిక్స్ అయిపోతారు. కానీ రియాలిటీ వేరేలా ఉంటుంది. ఆ సిగ్నల్ బార్స్ కేవలం మీ ఫోన్ దగ్గరలోని సెల్యులార్ టవర్‌ను డిటెక్ట్ చేసి, దానికి కనెక్ట్ అయి ఉందని మాత్రమే చూపిస్తాయి.

మొబైల్ డేటా పర్ఫెక్ట్‌గా పని చేయాలంటే, మీ డివైజ్ టవర్‌తో కనెక్ట్ అవ్వడమే కాకుండా, టెలికాం క్యారియర్ నెట్‌వర్క్‌తో సక్సెస్‌ఫుల్‌గా డేటా కనెక్షన్‌ను కూడా పూర్తి చేయాలి. ఒకవేళ ఈ ప్రాసెస్ మధ్యలో ఫెయిల్ అయితే, మీ ఫోన్ స్క్రీన్ మీద ఫుల్ సిగ్నల్ చూపిస్తున్నప్పటికీ డేటా మాత్రం అస్సలు ముందుకు కదలదు.

35
నెట్‌వర్క్ కంజెషన్, క్యారియర్ ప్రాబ్లమ్స్

కొన్నిసార్లు పీక్ అవర్స్‌లో అంటే ఎక్కువ మంది జనాలు ఇంటర్నెట్ వాడే సమయంలో ఒకే టవర్ పరిధిలోకి వేల సంఖ్యలో డివైజ్‌లు వస్తాయి. ఈ డివైజ్‌లన్నీ ఒకేసారి బ్యాండ్‌విడ్త్ కోసం పోటీ పడటం వల్ల నెట్‌వర్క్ రద్దీ ఏర్పడుతుంది. ఇలాంటి టైమ్‌లో సిగ్నల్ బలంగా ఉన్నప్పటికీ డేటా సర్వీసెస్ చాలా స్లో అయిపోతాయి లేదా పూర్తిగా ఆగిపోతాయి.

మరికొన్ని సార్లు ప్రాబ్లం పూర్తిగా టెలికాం ఆపరేటర్ సైడ్ నుంచే ఉంటుంది. ఇండస్ట్రీ సపోర్ట్ ఫోరమ్స్ లోని డేటా ప్రకారం.. కస్టమర్ కేర్ ప్రతినిధులు అకౌంట్ సెట్టింగ్స్‌ను రీఫ్రెష్ చేసిన వెంటనే చాలామందికి ఇంటర్నెట్ మళ్లీ మామూలుగా పని చేయడం ప్రారంభించింది. మీ బిల్లింగ్ ఇష్యూస్ ఉన్నా, అకౌంట్ ప్రొవిజనింగ్ ఎర్రర్స్ వచ్చినా, లేదా మీ డేటా ప్లాన్ పరిమితులు అడ్డుపడినా కనెక్టివిటీ కట్ అవుతుంది. అలాగే మీ మంత్లీ డేటా లిమిట్ అయిపోతే క్యారియర్లు ఇంటర్నెట్ స్పీడ్‌ను తగ్గించేస్తాయి. అప్పుడు కనెక్షన్ యాక్టివ్‌గా ఉన్నట్లు అనిపించినా నెట్ మాత్రం అస్సలు లోడ్ అవ్వదు.

45
వీపీఎన్, యాప్స్, రాంగ్ సెట్టింగ్స్

మీ ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ కూడా మొబైల్ డేటాకు అడ్డుపడవచ్చు. మీ ఫోన్‌లో యాక్టివ్‌గా ఉన్న వీపీఎన్ సర్వీసెస్, నెట్‌వర్క్ యాక్సిలరేషన్ టూల్స్ లేదా ఏవైనా సెక్యూరిటీ యాప్స్ సెల్యులార్ కనెక్షన్‌ను బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది. నెట్‌వర్క్ కనెక్షన్ బాగున్నా ఇవి డేటా ట్రాఫిక్‌ను ఆపేస్తుంటాయి.

దీంతో పాటు ఫోన్ లోని ఏపీఎన్ సెట్టింగ్స్ తప్పుగా ఉన్నా ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, యూజర్లు కొన్నిసార్లు పొరపాటున కొన్ని నిర్దిష్టమైన యాప్స్‌కు మొబైల్ డేటా పర్మిషన్లను డిసేబుల్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఫోన్‌లో ఇంటర్నెట్ బాగానే ఉన్నా, ఆ పర్టిక్యులర్ యాప్ మాత్రం ఓపెన్ అవ్వదు.

55
True 5G Signal But No Internet : ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి?

మీ ఫోన్‌లో ఫుల్ 5G సిగ్నల్ కనిపిస్తున్నా ఏదీ లోడ్ అవ్వకపోతే, సర్వీస్ సెంటర్‌కు పరిగెత్తే ముందు నిపుణులు సూచిస్తున్న ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..

  1. ఫ్లైట్ మోడ్ ఆన్ అండ్ ఆఫ్: మీ ఫోన్‌లో ఒకసారి ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి, కొన్ని సెకన్ల తర్వాత ఆఫ్ చేయండి. ఇది నెట్‌వర్క్‌ను రీఫ్రెష్ చేస్తుంది.
  2. ఫోన్ రీస్టార్ట్: చాలా సమస్యలకు ఫోన్ రీస్టార్ట్ చేయడం అనేది ఒక బెస్ట్ అండ్ ఈజీ సొల్యూషన్. ఫోన్‌ను ఒక్కసారి స్విచాఫ్ చేసి ఆన్ చేయండి.
  3. VPN డిసేబుల్: మీ ఫోన్‌లో ఏదైనా వీపీఎన్ రన్ అవుతుంటే, దాన్ని కాసేపు తాత్కాలికంగా డిసేబుల్ చేసి నెట్ వస్తుందో లేదో చెక్ చేయండి.
  4. నెట్‌వర్క్ సెట్టింగ్స్ రీసెట్: ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయడం ద్వారా తప్పుడు కాన్ఫిగరేషన్లు తొలగిపోతాయి.
  5. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్: మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాకుండా పెండింగ్‌లో ఉంటే, వెంటనే లేటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి.
  6. ఏపీఎన్ సెట్టింగ్స్ వెరిఫై: మీ టెలికాం ఆపరేటర్‌కు సంబంధించిన కరెక్ట్ ఏపీఎన్ సెట్టింగ్స్ ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోండి.
  7. ఆపరేటర్‌ను సంప్రదించండి: పైన పేర్కొన్నవన్నీ చేసినా ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే, మీ సిమ్ కార్డ్ మొబైల్ ఆపరేటర్‌ను కాంటాక్ట్ అవ్వండి.
Read more Photos on
click me!

Recommended Stories