జుట్టు రాలే సమస్యను నివారించడానికి చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ ఇంట్లోనే దొరికే కొన్ని సహజ పదార్థాలతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో.. ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.
మనలో చాలామంది రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యను నివారించడానికి.. కొంతమంది మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. మరికొంతమంది పార్లర్‌లకు వెళ్లి హెయిర్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటారు. దీనివల్ల జుట్టుకు హాని కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టడం మంచిది అంటున్నారు నిపుణులు. ఆ పదార్థాలు ఏంటో.. వాటిని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.
28
గుడ్డు, పాలతో హెయిర్ మాస్క్
ఒక గిన్నెలో గుడ్డు పచ్చసొన తీసుకోండి. దీనికి అరకప్పు పాలు కలపండి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేయండి. కొద్దిగా ఆలివ్ నూనె వేయండి. అన్నింటిని బాగా కలిపి ప్యాక్ తయారుచేయండి.
38
ఎలా వాడాలంటే?
ఈ మిశ్రమాన్ని జుట్టు కొసల నుంచి వేర్ల వరకు పట్టించండి. కొంతసేపు అలాగే ఉంచి, తర్వాత షాంపూతో కడిగేయండి. గుడ్డు, పాలు జుట్టుకు ఎలా పోషణనిస్తాయో, అలాగే నిమ్మకాయ గుణం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు రాలే సమస్య ఆగుతుంది.
పెరుగు, ఆపిల్ సైడర్ వెనిగర్, తేనెతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో అరకప్పు పెరుగు తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. 1 టీ స్పూన్ తేనె వేయండి. వాటిని బాగా కలిపి ప్యాక్ తయారు చేయండి.
58
హెయిర్ మాస్క్ ఎలా వాడాలంటే?
ఈ మిశ్రమాన్ని జుట్టు కొసల నుంచి వేర్ల వరకు పట్టించండి. కొంతసేపు అలాగే ఉంచి, షాంపూతో శుభ్రం చేయండి. ఇది జుట్టు రాలే సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తైన జుట్టు మీ సొంతమవుతుంది.
68
అరటిపండు, కొబ్బరినూనెతో..
అరటి పండు, కొబ్బరి నూనెతో మాస్క్ తయారు చేసుకోవచ్చు. సగం అరటిపండు తీసుకుని దాన్ని మెత్తగా చేయాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేయాలి. రెండింటిని బాగా కలిపి ప్యాక్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పూర్తిగా పట్టించాలి. కొంతసేపు అలాగే ఉంచి.. షాంపూతో కడిగేయాలి.
78
ఆముదం, కొబ్బరినూనె..
ఆముదం, కొబ్బరి నూనె, అలోవెరా జెల్‌తో కూడా హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ముందుగా అలోవెరా జెల్ తీసుకొని అందులో కొబ్బరి నూనె, ఆముదం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు పట్టించాలి. అది ఆరిన తర్వాత షాంపూతో కడిగేయాలి.
88
గుడ్డు, పెరుగు హెయిర్ మాస్క్
ఒక గిన్నెలో గుడ్డు పచ్చసొన తీసుకోండి. దీనికి 2 స్పూన్ల పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించండి. అది ఆరిన తర్వాత షాంపూ చేయండి. వారానికి ఒకసారి ఈ మాస్క్ వాడితే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.