నాన్ స్టిక్ పాత్రను ఎంతకాలం వాడొచ్చు? వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

Published : Oct 27, 2025, 05:03 PM IST

మనం చేసే వంటలు ఎంత రుచిగా ఉన్నా.. వాడే పాత్రలు సరిగ్గా లేకపోతే.. ఆరోగ్యానికి ముప్పు తప్పదు. ప్రస్తుతం చాలామంది కిచెన్ లో నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. అవేంటో చూద్దాం. 

PREV
15
నాన్ స్టిక్ పాత్రలు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రస్తుతం మన వంటగదిలో నాన్-స్టిక్ పాత్రలు భాగమైపోయాయి. తక్కువ నూనెతో వండుకోవచ్చని, శుభ్రం చేయడం ఈజీ అని లేదా వంట త్వరగా అయిపోతుందని చాలామంది వీటిని ఇష్టపడుతున్నారు. అయితే, నాన్-స్టిక్ పాత్రలు సరైన విధంగా ఉపయోగించకపోతే అవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా వాటి మీద ఉండే కోటింగ్ అధిక వేడి వద్ద కరిగి హానికర వాయువులను విడుదల చేస్తుంది. కాబట్టి నాన్-స్టిక్ పాత్రలు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

25
ఎక్కువ వేడిపై వండకూడదు

నాన్-స్టిక్ పాత్రల్లో వంట చేసేటప్పుడు హై ఫ్లేమ్ పై పెట్టకూడదు. దానివల్ల పాత్రపై ఉన్న కోటింగ్ వేడెక్కి క్రమంగా కరుగుతుంది. ఇది గాలిలోకి కొన్ని హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. వీటిని పీల్చడం ఆరోగ్యానికి మంచిదికాదు. ముఖ్యంగా పక్షులకు, చిన్న పిల్లలకు ఇది హానికరమని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేసేటప్పుడు మీడియం లేదా లో ఫ్లేమ్ పై చేయడం మంచిది. అంతేకాదు నాన్-స్టిక్ పాత్రను ఖాళీగా వేడిచేయడం కూడా చాలా ప్రమాదకరం. ఆ కోటింగ్ చాలా వేగంగా వేడెక్కి రసాయన వాయువులను విడుదల చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ ఖాళీ పాత్రను వేడిచేయకూడదు. 

35
మెటల్ స్పూన్లు లేదా ఫోర్కులు వాడకూడదు

నాన్-స్టిక్ పాత్రలపై ఉన్న కోటింగ్ చాలా సున్నితమైంది. మెటల్ స్పూన్లు, ఫోర్కులు, కత్తుల వంటివి వాడితే కోటింగ్ చెదిరిపోతుంది. అవి ఆహారంలోకి చేరి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి చెక్క లేదా సిలికాన్ స్పూన్లు వాడటం మంచిది. దాంతోపాటు పాత్ర కడిగేటప్పుడు వాటిని రఫ్ స్క్రబ్బర్లతో రుద్దకూడదు. అలా చేస్తే కోటింగ్ ఊడిపోతుంది. గోరువెచ్చని నీటిలో కొంచెం మైల్డ్ డిష్ లిక్విడ్ వేసి సాఫ్ట్ స్పాంజ్‌తో శుభ్రం చేయాలి.

45
పాత్రను చల్లబరచి మాత్రమే కడగాలి

కొన్ని సార్లు వంట చేసిన వెంటనే చల్లని నీటిలో పాత్రను ముంచుతారు. అలా అస్సలు చేయకూడదు. వేడి పాత్రను చల్లని నీటిలో వేసినప్పుడు కోటింగ్ దెబ్బతినచ్చు. కాబట్టి నాన్-స్టిక్ పాత్ర పూర్తిగా చల్లబడిన తర్వాతే కడగాలి. దానివల్ల పాత్ర ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. 

సరైన మోతాదులో నూనె

నాన్-స్టిక్ పాత్రల్లో తక్కువ నూనెతో వంట చేయవచ్చు. కానీ పూర్తిగా నూనె లేకుండా వంట చేయడం కూడా మంచిది కాదు. సరైన మోతాదులో నూనె వాడటం వల్ల ఆహారం పాత్రకు అతుక్కుపోకుండా ఉండటంతో పాటు.. కోటింగ్ కూడా సురక్షితంగా ఉంటుంది.

55
నాన్-స్టిక్ పాత్రను ఎన్ని రోజులు వాడొచ్చు?

నాన్ స్టిక్ పాత్రపై పగుళ్లు, కోటింగ్ ఊడిపోవడం లేదా బూడిద రంగు మచ్చలు కనబడితే ఆ పాత్రను వాడకూడదు. సాధారణంగా మంచి నాణ్యత కలిగిన నాన్-స్టిక్ పాత్రలను 2–3 సంవత్సరాల వరకు సురక్షితంగా ఉపయోగించవచ్చు. తర్వాత అవి కోటింగ్ కోల్పోతాయి. కాబట్టి వాటిని సకాలంలో మార్చడం ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories