నల్లని, ఒత్తైన జుట్టు కోసం అమ్మాయిలు చేయని ప్రయత్నాలు ఉండవు. వాడని ప్రోడక్టులు ఉండవు. అయితే కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. మరి ఏం కలపాలి? ఎలా వాడాలి వంటి విషయాలు ఇక్కడ చూద్దాం.
సాధారణంగా చాలా మంది జుట్టుకు కొబ్బరి నూనెను ఉపయోగిస్తుంటారు. అయితే మీకు పొడవైన, ఒత్తైన జుట్టు కావాలంటే కేవలం కొబ్బరి నూనె రాస్తే సరిపోదు. దానితో పాటు ఇంకో పదార్థాన్ని కలపాలి. అదేమిటో.. దాన్ని ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.
25
కొబ్బరి నూనె, మెంతులు..
పొడవైన, దట్టమైన జుట్టు పొందాలంటే కొబ్బరి నూనెలో మెంతులను కలిపి ఉపయోగించాలి. మెంతులు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివని ఆయుర్వేదం చెబుతోంది. ఇది జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా చుండ్రు, దురద వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన పరిశోధన ప్రకారం మెంతులు జుట్టుకు చాలా మంచివని తేలింది. మరి మెంతులను కొబ్బరి నూనెతో కలిపి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
35
కొబ్బరి నూనెలో మెంతులను ఎలా కలపాలి?
100 మి.లీ కొబ్బరి నూనెలో రెండు స్పూన్ల మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసి 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తర్వాత నూనె చల్లారనివ్వాలి. వడకట్టి.. ఒక గాజు సీసాలో నింపాలి. వారానికి రెండుసార్లు ఈ నూనెను తలకు రాసి నెమ్మదిగా మసాజ్ చేయాలి. రాత్రి పూట రాసుకుని ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయవచ్చు.
మెంతులు కలిపిన నూనె జుట్టును పొడిబారకుండా చేస్తుంది. ఈ నూనెను రాస్తే తలకు అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో జుట్టు మృదువుగా, పట్టులా మారుతుంది. జుట్టు బలంగా మారుతుంది.
2. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
కొబ్బరి నూనె జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మెంతుల్లో ఉండే ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇవి రెండూ కలిసి జుట్టు వేగంగా, పొడవుగా పెరగడానికి సహాయపడతాయి.
55
తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది!
తెల్లజుట్టు సమస్య ఉన్నవారు కొబ్బరి నూనె, మెంతులు కలిపిన నూనెను ఉపయోగించవచ్చు. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. తెల్లజుట్టు సమస్యను నివారిస్తుంది.
చుండ్రు సమస్యకు చెక్
మెంతులు చుండ్రు సమస్యను తగ్గించడంలో సహాయపడుతాయి. జుట్టుకు మెరుపును ఇస్తాయి. మెంతులను మెత్తగా నూరి, దానికి కొబ్బరి నూనె కలిపి హెయిర్ ప్యాక్ లా కూడా వాడచ్చు.