ప్రస్తుతం చాలామంది రకరకాల జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటి నివారణకు ఖరీదైన ప్రోడక్టులు వాడుతున్నారు. కానీ ఈ ఒక్క నూనెతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఆ నూనెంటో.. ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.
నల్లమిరియాల నూనె.. జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. చుండ్రును తగ్గించి, జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
24
జుట్టు పెరుగుదలకు...
నల్ల మిరియాల నూనెలో పైపెరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి.. పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బట్టతలపై ఈ నూనెను రోజూ రాస్తే జుట్టు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
34
చుండ్రు తగ్గడానికి..
నల్ల మిరియాల నూనె.. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చుండ్రును ప్రభావవంతంగా తగ్గించడంలో సహాయపడుతుంది. తలపై చర్మాన్ని శుభ్రంచేసి.. చుండ్రు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.
మృదువైన జుట్టు..
నల్ల మిరియాల నూనెలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేసి.. రాలడాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు జుట్టును మృదువుగా చేయడంలో సహాయడపడతాయి.
కొద్దిగా నల్ల మిరియాల నూనెను తీసుకొని తలకు పట్టించి మృదువుగా మసాజ్ చేయాలి. ఒకటి లేదా 2 గంటల తర్వాత షాంపూతో కడిగేయాలి.
నల్ల మిరియాల నూనెను కొంచెం కొబ్బరి నూనె, బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ తో కలిపి పెట్టుకోవచ్చు. ముందుగా ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఆ తర్వాత షాంపూతో కడిగేయాలి.
నల్ల మిరియాల నూనెను పెరుగు లేదా తేనె, గుడ్డుతో కలిపి హెయిర్ మాస్క్ గా వాడచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఇది గుర్తుంచుకోండి:
ఈ నూనెను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. చికాకు లేదా దురద అనిపిస్తే.. వాడకపోవడమే మంచిది.