మనలో చాలామంది రెగ్యులర్ గా ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు. కొందరు వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడితే.. మరికొందరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడుతుంటారు. కానీ ఈ రెండింటిలో ఏది మంచిది? ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల కలిగే లాభ నష్టాల గురించి డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
స్మార్ట్‌ఫోన్ వాడకం పెరుగుతున్న కొద్దీ, ఇయర్‌ఫోన్స్ వాడకం కూడా పెరిగిపోతోంది. ఆఫీస్ కాల్స్, ఆన్‌లైన్ క్లాసులు, మ్యూజిక్, వీడియోలు ఇలా ప్రతిదానికి ఇయర్‌ఫోన్స్ తప్పనిసరి అయిపోయాయి. అయితే వైర్‌లెస్ సౌలభ్యం ఇచ్చే బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ మంచివా? లేక వైర్డ్ ఇయర్‌ఫోన్స్ సురక్షితమా? వేటి వల్ల ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది? డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
26
బ్లూటూత్ ఇయర్ ఫోన్స్
బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వాడటానికి ఈజీగా ఉంటాయి. వైర్లు లేకపోవడం వల్ల జిమ్‌లో, నడుస్తూ, ప్రయాణాల్లో వీటిని ఉపయోగించవచ్చు. అయితే బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల ద్వారా ఫోన్‌తో కనెక్ట్ అవుతాయి. ఇయర్ బర్డ్స్ ని చెవిలో పెట్టుకున్నప్పుడు అవి బ్రెయిన్ కు చాలా తక్కువ దూరంలో ఉంటాయి. కాబట్టి రేడియేషన్ ప్రభావం నేరుగా మెదడు ఆరోగ్యంపై పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
36
వైర్డ్ ఇయర్ ఫోన్స్
వైర్డ్ ఇయర్‌ఫోన్స్ విషయానికి వస్తే, ఇవి బ్లూటూత్ లాంటి వైర్‌లెస్ రేడియేషన్‌ను ఉపయోగించవు. కాబట్టి ఈ ఇయర్ ఫోన్స్ సురక్షితమైన ఎంపికగా డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువసేపు కాల్స్ మాట్లాడే వారు లేదా స్టడీ, ఆఫీస్ పనుల కోసం గంటల తరబడి ఇయర్‌ఫోన్స్ వాడేవారికి వైర్డ్ ఇయర్ ఫోన్స్ మంచివని సూచిస్తున్నారు.
నిపుణుల ప్రకారం బ్లూటూత్ లేదా వైర్డ్ ఇయర్ ఫోన్స్, ఏవి వాడినా సరే... సౌండ్ ఎక్కువగా పెట్టుకొని ఎక్కువసేపు వినడం వల్ల వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య పెరుగుతోందని అంటున్నారు. చెవుల్లో గంటల తరబడి ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం వల్ల చెవి లోపల తేమ పెరిగి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, నొప్పి, ఇయర్ బ్లాకేజ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
56
ఇయర్ ఫోన్స్ డిజైన్
బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా ఇయర్ క్యానల్‌లో లోతుగా ఉండే డిజైన్‌లో ఉంటాయి. దానివల్ల సౌండ్ నేరుగా చెవి లోపలికి వెళ్తుంది. అలాగే వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో కూడా ఇన్-ఇయర్ మోడల్స్ ఉంటాయి. వాటిని వాడినా ప్రమాదం అదే స్థాయిలో ఉంటుంది. కాబట్టి డిజైన్, ఫిట్, వాల్యూమ్ లెవల్ వంటి వాటిపై కచ్చితంగా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
66
60-60 రూల్
డాక్టర్ల సూచనల ప్రకారం ఏ ఇయర్‌ఫోన్స్ వాడినా “60-60 రూల్” పాటించడం మంచిది. అంటే వాల్యూమ్ గరిష్ట స్థాయిలో 60 శాతం మించకూడదు. ఒకేసారి 60 నిమిషాల కంటే ఎక్కువ వినకూడదు. మధ్య మధ్యలో చెవులకు విశ్రాంతి ఇవ్వాలి. కాల్స్ మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు స్పీకర్ మోడ్ ఉపయోగించడం మంచిది.