ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే.. రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోలేము. దోమకాటు వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి దోమలను తరిమికొట్టడం ముఖ్యం. అందుకు అరటి తొక్క చక్కగా ఉపయోగపడుతుంది. అరటి తొక్కను ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.
వానాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమల వల్ల కొన్నిసార్లు నిద్రకూడా ఉండదు. అయితే అరటి తొక్కతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీని ఘాటైన వాసన దోమలను రాకుండా చేస్తుంది. అంతేకాదు అరటి తొక్కలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దోమకాటు వల్ల కలిగే దురద, మంటను తగ్గిస్తాయి. మరి దోమలను తరిమికొట్టేందుకు అరటి తొక్కను ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.
25
అరటి పండు ప్రయోజనాలు
అరటిపండు ఎంత రుచికరమైందో అంత ఆరోగ్యకరమైంది. దాని తొక్క కూడా చాలా ఉపయోగకరమైంది. అవును.. అరటి తొక్కలోని గుణాలు నిద్రను మెరుగుపరచడమే కాకుండా.. చర్మాన్ని రక్షించడంలో కూడా సహాయపడతాయి. అంతేకాదు అరటి తొక్కతో దోమలను కూడా తరిమికొట్టవచ్చు. దోమకాటు నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ తొక్క సహాయపడుతుంది.
35
దోమల నివారణకు అరటి తొక్క
సాధారణంగా వానాకాలంలో దోమల బెడద ఎక్కువవుతుంది. వాటి వల్ల డెంగ్యూ, మలేరియా వంటి అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. అయితే అరటి తొక్కతో దోమల సమస్యకు చెక్ పెట్టవచ్చు. అరటి తొక్కలోని ఘాటైన వాసన దోమలను ఇంట్లోకి రాకుండా చేస్తుంది.
దోమలను ఇంట్లో నుంచి తరిమికొట్టేందుకు ముందుగా మీరు అరటి తొక్కను తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. ఇంటి మూలల్లో ఉంచాలి. కావాలంటే.. అరటి తొక్కను కాల్చి ఇంట్లో పొగను వ్యాపింపజేయవచ్చు. ఆ పొగ, వాసన వల్ల దోమలు పరార్ అవుతాయి.
55
దోమకాటు నుంచి ఉపశమనం..
దోమ కుడితే దురద, మంట రావడం సహజం. అయితే దోమ కుట్టినప్పుడు.. అరటి తొక్కలోని తెల్లటి భాగాన్ని తీసుకొని కుట్టిన చోట రుద్దవచ్చు. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దురద, మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు.. అరటి తొక్కలోని సహజ ఎంజైమ్‌లు దోమల లాలాజలంలో ఉండే ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేస్తాయి. దానివల్ల వాపు, మంట నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.