Monsoon Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు బాగుండాలంటే ఈ చిట్కాలు ఫాలో కావాల్సిందే!

Published : Jul 04, 2025, 02:39 PM IST

సాధారణంగా చాలామందికి వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. ఎక్కువ తేమ, చెమట, వర్షంలో తడవడం వంటివి ఇందుకు కారణాలు కావచ్చు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.  

PREV
16
వర్షాకాలంలో జుట్టు సంరక్షణ చిట్కాలు..

వర్షాకాలంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలతోపాటు జుట్టు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటి నివారణకు చాలామంది రకరకాల ప్రోడక్టులు వాడుతుంటారు. అయితే కొన్ని సహజమైన చిట్కాలు పాటించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా…  

26
వారానికి మూడుసార్లు..

వర్షాకాలంలో తలపై చర్మాన్ని(స్కాల్ప్) శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వారానికి రెండు నుంచి మూడు సార్లు గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి. దీనివల్ల దుమ్ము, ధూళి, నూనె, చెమట కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి.

36
నియమితంగా షాంపూ చేయండి

వర్షాకాలంలో జుట్టు రకానికి అనుగుణంగా ఉండే షాంపూ, కండిషనర్‌ను ఉపయోగించాలి. అధిక రసాయనాలు కలిగిన షాంపూలను నివారించడం మంచిది. కండిషనర్ జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

46
నూనెతో జుట్టుకు మసాజ్..

వర్షాకాలంలో జుట్టు పొడిబారకుండా ఉండటానికి, జుట్టు కుదుళ్లను బలపరచడానికి నూనెను ఉపయోగించడం మంచిది. కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. రాత్రి పడుకునే ముందు తలపై నూనెతో మసాజ్ చేసుకోవచ్చు. ఉదయం లేచి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. 

56
తడి జుట్టు..

వర్షంలో జుట్టు తడిస్తే.. దాన్ని బాగా తుడవాలి. వీలైతే గాలిలో కాస్త ఆరనివ్వాలి. అయితే గట్టిగా రుద్ది తుడవకూడదు. దీనివల్ల జుట్టు చిట్లిపోయే అవకాశం ఉంటుంది.

66
వర్షంలో తడవకుండా ఉండేందుకు..

వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా స్కార్ఫ్‌ని ఉపయోగించండి. అలాగే జుట్టు త్వరగా ఆరబెట్టడానికి హీట్ ట్రీట్‌మెంట్‌ను నివారించండి. దీనివల్ల జుట్టు దెబ్బతినే ప్రమాదం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories