World Cancer Day: క్యాన్స‌ర్‌ను జ‌యించ‌డం పెద్ద క‌ష్టమేమి కాదు.. వీరి క‌థ‌లు వింటే మీరూ ఇదే అంటారు.

Published : Feb 03, 2026, 05:20 PM IST

World Cancer Day: క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి కార‌ణంగా వేలాది మంది మ‌ర‌ణిస్తున్నారు. అయితే స‌రైన అవ‌గాహ‌న ఉంటే క్యాన్స‌ర్‌ను జయించ‌డం పెద్ద క‌ష్ట‌మేమి కాద‌ని ఎంతో మంది నిరూపించారు. ప్ర‌పంచ క్యాన్స‌ర్ దినోత్స‌వం సంద‌ర్భంగా అలాంటి కొందరి కథలు మీకోసం. 

PREV
14
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని (ఫిబ్ర‌వ‌రి 4) పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. “United By Unique” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్యాన్సర్‌ను జయించిన సర్వైవర్లు పాల్గొని, తమ జీవిత ప్రయాణాలను పంచుకున్నారు. వారి అనుభవాలు ఇతరులకు ప్రేరణగా నిలిచాయి.

24
ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్‌పై విజయం సాధ్యం

ఈ కార్యక్రమంలో డా. నివేద్ రావు బల్మూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కీలక విషయాలు వెల్లడించారు. భారతదేశంలో ప్రతి ఏడాది సుమారు 14 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. జీవితకాలంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే ప్రారంభ దశలో గుర్తిస్తే చాలా కేసుల్లో వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని స్పష్టం చేశారు.

34
అవగాహన లోపమే ప్రధాన సమస్య

డా. నివేద్ రావు మాట్లాడుతూ, క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే జీవన అవకాశాలు 70 నుంచి 90 శాతం వరకు ఉంటాయని తెలిపారు. అయినప్పటికీ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది చివరి దశలోనే ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో నిరంతర అవగాహన అవసరం అని చెప్పారు.

ఆధునిక చికిత్సలతో మెరుగైన ఫలితాలు

కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా. గౌతమ్ మాట్లాడుతూ, క్యాన్సర్ పట్ల భయం, అపోహల కారణంగా చికిత్స ఆలస్యం అవుతోందని అన్నారు. ప్రస్తుతం కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వంటి ఆధునిక వైద్య విధానాలతో ప్రారంభ దశలోనే మంచి ఫలితాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు. సమయానికి వైద్యులను సంప్రదిస్తే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.

44
సర్వైవర్ల సందేశం: భయపడొద్దు, ముందుకు రండి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్యాన్సర్ సర్వైవర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. సకాలంలో వైద్యులను సంప్రదించడం, చికిత్సను మధ్యలో ఆపకుండా కొనసాగించడం వల్లే తాము ఆరోగ్యంగా కోలుకున్నామని చెప్పారు. కొత్తగా క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి తాము మార్గదర్శకులుగా నిలవాలని, అవగాహన కల్పించే తొలి వ్యక్తులుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సర్వైవర్లకు, వారి కుటుంబాలకు మెడికవర్ హాస్పిటల్స్ ఫ్యామిలీ కార్డులను అందజేశారు.

Read more Photos on
click me!

Recommended Stories