Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ డీట్‌ ద్వారా 10,080 ఉద్యోగాలు

Published : Jun 15, 2025, 11:54 PM IST

Jobs: తెలంగాణ డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ ద్వారా 10,080 ఉద్యోగ అవకాశాలు విడుదల అయ్యాయి. అర్హత కలిగిన అందరూ వెంటనే నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

PREV
16
తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

Jobs: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (DEET) ద్వారా 10,080 ఉద్యోగ ఖాళీలు ప్రైవేట్ రంగంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని డీట్‌ సంచాలకుడు జె. రాజేశ్వర్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు.

26
విభిన్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు

ప్రస్తుతం ఐటీ, ఫార్మా, ఇన్సూరెన్సు, బ్యాంకింగ్, మేనేజ్‌మెంట్, డిజిటల్‌ మార్కెటింగ్‌ వంటి రంగాల్లో సంస్థలు పెద్ద సంఖ్యలో ఖాళీలు ప్రకటించాయి. డీట్‌ ద్వారా ఇప్పటికే 972కి పైగా కంపెనీలు తమ వివరాలు నమోదు చేసుకున్నాయి. ఇందులో 75,000 మందికిపైగా నిరుద్యోగులు/విద్యార్థులు రిజిస్టర్‌ అయ్యారు.

36
DEET రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?

అభ్యర్థులు తమ అర్హత, అనుభవం, నైపుణ్యాలకు సంబంధించిన వివరాలను DEET పోర్టల్‌లో నమోదు చేయాలి. పోర్టల్‌లో ‘జాబ్‌ సీకర్‌’గా పేరును నమోదు చేస్తే, రెజ్యూమ్‌ తయారవుతుంది. ఉద్యోగ అవసరాలు ఉన్న కంపెనీలు వాటి అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులను రిక్రూట్‌ చేసుకుంటలాయి.

DEETలో నమోదు చేసుకోవాలంటే: DEET Direct Registration Link

46
DEET లో ఎవరెవరు నమోదు చేసుకోవచ్చు?

• 15 ఏళ్లు దాటి ఉన్నవారు అందరూ నమోదు చేసుకోవచ్చు.

• ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కళాశాలల ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.

• వీరు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాలేజీల ప్రిన్సిపాళ్లకు విద్యార్థుల నమోదు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది.

56
డీట్ నమోదుతో సౌకర్యవంతమైన ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులు నమోదు చేసిన డేటా ఆధారంగా, సంస్థల అవసరాలకు అనుగుణంగా DEET సిస్టం అభ్యర్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా ఎంపిక చేస్తుంది. కంపెనీలు లైక్‌ రిక్వెస్ట్‌లు పంపిస్తాయి. అభ్యర్థి ‘లైక్’ చేస్తే, ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. చివరికి ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగానికి ఎంపికైతే, అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను డీట్‌ ద్వారానే ఇస్తారు.

66
ఇంటర్న్‌షిప్‌లు, శిక్షణలు కూడా డీట్ లో ఉంటాయి

DEET ద్వారా ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, శిక్షణా కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం 153 విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలు DEETలో లభ్యమవుతున్నాయి.

ప్రతి జిల్లాలో డీట్‌ పనితీరును పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్లను ఛైర్మన్‌లుగా నియమించారు. TG-iPASSలో పరిశ్రమ అనుమతికి దరఖాస్తు చేసిన ప్రతి సంస్థ తప్పనిసరిగా డీట్‌ పోర్టల్‌లో కూడా నమోదు చేయాల్సిన నిబంధన విధించారు.

Read more Photos on
click me!

Recommended Stories