హైద‌రాబాద్‌లో ఎక్క‌డ భూమి కొనాలి.? ఈ ప్రాంతాల్లో ఈరోజు కొంటే రేపు కోట్లు కురుస్తాయి.

Published : Sep 03, 2025, 11:49 AM IST

Real estate: భూమిపై పెట్టుబ‌డి పెట్టిన వారికి ఢోకా ఉండ‌ద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఎక్క‌డ భూమి కొనుగోలు చేశామ‌న్న దానిపైనే మ‌న భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంటుంది. హైద‌రాబాద్‌లో రియ‌ల్ ఎస్టేట్ హాట్‌స్పాట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
మారిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇకపై కేవలం మద్య ప్రాంతాలకే పరిమితం కాకుండా, పలు దిశల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. కోలియర్స్ తాజా నివేదిక ప్రకారం, వచ్చే 3–5 ఏళ్లలో పెరిఫెరల్ మైక్రో మార్కెట్లు (పట్టణ పరిసర ప్రాంతాలు) హైదరాబాద్‌లో గ్రేడ్ A ఆఫీస్ స్థలంలో 12–15% వాటా, వార్షిక లీజింగ్‌లో 10% వరకు భాగం పొందనున్నాయి.

DID YOU KNOW ?
విస్తరిస్తోన్న రియల్ రంగం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇకపై కేవలం మద్య ప్రాంతాలకే పరిమితం కాకుండా, పలు దిశల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది.
25
పడమర వైపు వేగవంతమైన అభివృద్ధి

ప‌ట్ట‌ణానికి ప‌డ‌మ‌ర దిశ‌లోని కోకాపేట్, నీయోపోలిస్, మియాపూర్, నల్లగండ్ల ప్రాంతాలు ప్రధాన కార్యాలయాలు, నివాస కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 10 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్థలం 2027 నాటికి 22 మిలియన్లకు రెట్టింపు అవుతుందని అంచనా. హైటెక్ సిటీకి దగ్గరగా ఉండటం, మెట్రో విస్తరణ ప్రాజెక్టులు ఈ వృద్ధికి తోడ్పడుతున్నాయి. ఇక్కడ అద్దె రేట్లు 10–15% వరకు పెరగొచ్చని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

35
తూర్పు వైపు త‌క్కువ ధ‌ర‌లోనే

ఉప్పల్, పోచారం, ఎల్‌బీ నగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో చౌక ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు కేంద్ర ప్రాంతాల కంటే 40–50% తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో కారిడార్ 8 ప్రాజెక్టులు రానున్న సంవత్సరాల్లో రవాణా సౌకర్యాన్ని పెంచి, ఇక్కడ నివాసంతో పాటు పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేయనున్నాయి.

45
దక్షిణం వైపు డేటా సెంటర్లు, గిడ్డంగులు

శంషాబాద్, రాజేంద్రనగర్, ఆదిబట్ల ప్రాంతాలు కొత్తగా డేటా సెంటర్లు, గిడ్డంగుల కేంద్రాలుగా మారుతున్నాయి. ఇప్పటికే ఆపరేటర్లు 350 మెగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం పెంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో రానున్న ఎయిర్‌పోర్ట్ మెట్రో లింక్ ఈ ప్రాంత అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది.

55
ఉత్తర వైపు పరిశ్రమలు, లైఫ్ సైన్స్ పెట్టుబడులు

మేడ్చల్, కొంపల్లి, శామీర్‌పేట ప్రాంతాలు పరిశ్రమలతో పాటు లాజిస్టిక్స్ హబ్‌లుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇక్కడ ఉన్న పరిశ్రమల సమూహాలకు దగ్గరగా ఉండటం వ‌ల్ల‌ కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యంగా జీనోమ్ వ్యాలీకి అనుబంధంగా లైఫ్ సైన్స్, ఫార్మాస్యూటికల్ R&D రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయని అంచనా.

Read more Photos on
click me!

Recommended Stories