Published : Dec 25, 2025, 03:01 PM ISTUpdated : Dec 25, 2025, 03:08 PM IST
IMD Cold Wave Alert : తెలుగు ప్రజలకు ఈ చలిగాలుల నుండి త్వరలోనే విముక్తి లభించనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నాయి. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుతుందట… ఎప్పట్నుంచో తెలుసా?
IMD Cold Wave Alert : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి ఇరగదీస్తోంది. గత 20 రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతూ దారుణ స్థితికి చేరుకున్నాయి... మరో నాలుగైదురోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ డిసెంబర్ మొత్తం ఇలాగే చల్లని వాతావరణం ఉంటుందని... వచ్చే నెల జనవరి 2026 నుండి సాధారణ శీతాకాలంలో ఉండే వాతావరణం ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. అంటే తెలంగాణలో చలి తీవ్రత డిసెంబర్ 31 తర్వాత తగ్గుతుందన్నమాట.
27
రాబోయే రోజుల్లో తగ్గనున్న చలి
తెలంగాణలో డిసెంబర్ ఆరంభం నుండి చలిగాలుల తీవ్రత పెరిగింది. ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి... టెంపరేచర్స్ పడిపోవడం ప్రారంభమయ్యాయి. రోజులు గడుస్తున్నకొద్దీ ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతూ ఇటీవల కనిష్ఠంగా 4 డిగ్రీలకు చెరుకున్నాయి. కానీ గత రెండుమూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి... కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి చలి సాధారణ స్థాయికి చేరుకుంటుందని తెలంగాణ వెదర్ అంచనా వేస్తున్నారు.
37
సంక్రాంతికి మళ్లీ చలి పంజా
జనవరి ఆరంభంలో సాధారణ శీతాకాలం వాతావరణం ఉంటుందని... తిరిగి సంక్రాంతి సమయంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత జనవరి ఎండింగ్ నుండి ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుతుంది. ఇక ఫిబ్రవరి తో చలికాలం ముగుస్తుంది... మార్చిలో ఎండలు ప్రారంభం అవుతాయి. ఇలా జనవరి 2026 ఒక్కనెలే పీక్స్ చలి ఉంటుందని... తర్వాత అధిక టెంపరేచర్స్ నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది.
తెలంగాణలో ఇవాళ (డిసెంబర్ 25, గురువారం) అత్యల్ప ఉష్ణోగ్రతలు కొమ్రంభీం ఆసిఫాబాద్ తిర్యానిలో 6.9 డిగ్రీలు నమోదయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లా కోహీర్ లో 7.4, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో 8.5, వికారాబాద్ జిల్లా నవాబ్ పేటలో 9, ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలొ 9.3, కామారెడ్డి జిల్లా గాంధారిలో 9.4, నిర్మల్ జిల్లా పెంబిలో 9.6, సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్-భూంపల్లిలో 9.7, జయశంకర్ జిల్లా ముత్తారం మహదేవ్ పూర్ లో 9.9, మెదక్ జిల్లా పాపన్నపేటలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా పది జిల్లాల్లో 10 డిగ్రీలలోపు… మిగతా జిల్లాల్లో 10 నుండి 13 డిగ్రీ సెల్సియస్ లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
57
హైదరాబాద్ వెదర్
హైదరాబాద్ లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇవాళ జిహెచ్ఎంసి పరిధిలోని పటాన్ చెరులో 9.2 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. ఇక రాజేంద్ర నగర్ లో 8.5, బేగంపేటలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. జిల్లాలవారిగా సగటు లోయెస్ట్ టెంపరేచర్స్ చూస్తే అత్యల్పంగా ఆదిలాబాద్ లో 8.2, మెదక్ లో 8.8, హన్మకొండలో 10.5, రామగుండంలో 12.8, నిజామాబాద్ లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
67
మరో నాలుగైదురోజులు ఇదే వెదర్
ఇక రాబోయే నాలుగైదు రోజులు శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుండి 4 డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 25 నుండి 29 వరకు ఆదిలాబాద్, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్పంగా 5 నుండి 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. తర్వాత క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ చలి తీవ్రత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
77
ఏపీని వణికిస్తున్న చలి
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది... తెలంగాణలో కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు అరకు, మినుములూరు, పాడేరు ప్రాంతాల్లో 3 నుండి 5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలుంటూ చలి ఎక్కువగా ఉండటమే కాదు దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో ప్రజలు రాత్రి అయ్యిందంటే చాలు ఇళ్లలోంచి బయటకు రావడంలేదు... ఉదయం 8,9 గంటల వరకు బయటకు వచ్చేందుకు సాహసించడంలేదు.