Weather Update: బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న అల్పపీడనం.. ఆ జిల్లాల్లో వానలే వానలు !

Published : May 12, 2026, 07:16 AM IST

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, అకాల వర్షాలతో వింత వాతావరణం నెలకొంది. తెలంగాణలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాల హెచ్చరికలు వచ్చాయి.

PREV
15
మాడ పగిలే ఎండ.. ముంచెత్తే వాన: తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం కొనసాగుతోంది. బయట అడుగుపెడితే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు, అదే సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘాలు వచ్చి ఉరుములు, మెరుపులతో భయపెడుతోంది. అటు తెలంగాణలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఇటు ఏపీలో అల్పపీడన పరిస్థితులు మొదలయ్యాయి. అసలు రాబోయే రెండు రోజులు పరిస్థితి ఏంటి? ఎక్కడెక్కడ వానలు పడతాయి?

25
తెలంగాణలో నిప్పుల కొలిమి: 48 డిగ్రీలకు చేరనున్న టెంపరేచర్స్

ప్రస్తుతం తెలంగాణలో భానుడు భగభగలాడుతున్నాడు. ఇప్పటికే చాలా జిల్లాల్లో 40 డిగ్రీలు దాటేసింది. అయితే, అసలు సినిమా ముందుందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే 15 రోజుల్లో ఎండలు పీక్ స్టేజ్‌కు వెళ్తాయని, కొన్ని జిల్లాల్లో ఏకంగా 45 నుంచి 48 డిగ్రీల వరకు టెంపరేచర్ రికార్డ్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. 

ముఖ్యంగా మే 16 నుంచి 20 మధ్య ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో హీట్ వేవ్ జనాల్ని వణికించబోతున్నాయి. మధ్యాహ్నం వేళ బయట తిరిగితే డీహైడ్రేషన్ పక్కా అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

35
వెదర్ మ్యాన్ బాలాజీ అలెర్ట్: ఈ జిల్లాల్లో వానలు గ్యారెంటీ

ఒకవైపు ఎండలు దంచికొడుతున్నా, మరోవైపు అకాల వర్షాలు రైతన్నను ఆందోళనలో పడేస్తున్నాయి. వెదర్ మ్యాన్ బాలాజీ రిపోర్ట్ ప్రకారం.. వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారే అవకాశం ఉంది. వర్షం పడితే కాసేపు హాయిగా ఉన్నా, ఆ తర్వాత వచ్చే హ్యూమిడిటీ మాత్రం జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

45
ఏపీలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరీ వింతగా ఉంది. నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రోజుల్లో మరింత బలపడే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, చిత్తూరు వంటి ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ తెలిపారు. అయితే, ఒకే జిల్లాలో కొన్ని చోట్ల వానలు పడుతుంటే, పోలవరం ప్రాజెక్ట్ ఏరియా, అల్లూరి జిల్లాలోని కొన్ని మండలాల్లో మాత్రం వడగాల్పులు వీస్తున్నాయి.

55
అన్నదాతల ఆవేదన.. సామాన్యులకు సూచనలు

ఈ వింత వాతావరణం వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దవుతోంది. అటు ఈదురు గాలుల వల్ల మామిడి తోటల్లో కాయలు రాలిపోయి నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలోనే అధికారులు పలు సూచనలు చేశారు. 

మండే ఎండలతో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం పడేటప్పుడు చెట్ల కింద, కరెంటు స్తంభాల దగ్గర ఉండకండి. నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. నారింజ రసం, కొబ్బరి నీళ్లు తాగుతూ బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories