IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియాలో ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలతో అల్లకల్లోలమే

Published : May 11, 2026, 05:43 PM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియా సముద్రంలో ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వేసవి వర్షాలు ఊపందుకోనున్నాయి. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు...

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరింత చురుగ్గా మారనున్నాయి. ఇప్పటికే వాతావరణం వర్షాలకు అనుకూలంగా మారుతూ వస్తోంది... ఇప్పుడు ఏకంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో, నైరుతి బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 48 గంటల్లో ఇది మరింత బలపడనుందని భారత వాతావరణ శాఖ (IMD) సూచించింది.

25
ఈ జిల్లాలకు పొంచివున్న వర్షాల ముప్పు...

ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కొనసాగనున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చే గురువారం (మే 14) వరకు, రాయలసీమ జిల్లాల్లో ఈ మంగళవారం (మే 13) వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టిఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి జిల్లా జె.కె. వీధి, ముంచింగిపుట్టు.. పోలవరం జిల్లా గుర్తేడు మండలాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది... రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

35
తెలుగు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త...

 వర్షాల సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని APSDMA సూచించింది. పాత భవనాలు, భారీ హోర్డింగ్‌ల దగ్గర నిలబడవద్దని వారు హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.

45
తెలంగాణలో వర్షాలు

 తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు (మంగళవారం, మే 12న) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (30-40 kmpl) కూడిన వర్షాలుంటాయట.

55
అరేబియా సముద్రంలో ద్రోణి..

ఇదిలావుంటే ఇంకో ద్రోణి ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతోందట. తీరప్రాంత కర్ణాటక మీదుగా మహారాష్ట్రలోని మరాఠ్వాడా వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఇది కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా మే 14, 15 తేదీల్లో కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాబోయే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read more Photos on
click me!

Recommended Stories