IMD Rain Alert : ఈ రాత్రి భారీ వర్షాలు, వడగళ్ల బీభత్సం.. ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్

Published : Feb 23, 2026, 04:52 PM IST

Telangana Weather Update : ఈ రాత్రికి తెలంగాణలో భారీ వర్షాలు తప్పేలా లేవు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా రాత్రి కూడా కొనసాగే అవకాశాలున్నాయని తెలంగాణ  వెదర్ మ్యాన్ హెచ్చరించారు. 

PREV
16
తెలంగాణలో భారీ వర్షాలు

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి... ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఈ వర్షాలు మరిన్ని జిల్లాలకు వ్యాపించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా సంగారెడ్డితో పాటు కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

26
హైదరాబాద్ లో వర్షాలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా వాతావరణం చల్లబడింది.. ఆకాశం మేఘాలతో కమ్మేసి ఉంది. సాయంత్రం వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. నార్త్ హైదరాబాద్ లోని మేడ్చల్, దుండిగల్, శామీర్ పేట్, కీసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు.

36
హైదరాబాద్ ప్రజలు తస్మాత్ జాగ్రత్త...

హైదరాబాద్ తో పాటు శివారుప్రాంతాల్లో చిరుజల్లులు, అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షాల వల్ల హోర్డింగ్ లు కూలడం, కరెంటు తీగలు తెగిపడటం, స్తంభాలు, చెట్టుకొమ్మలు విరిగిపడటం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి వర్ష సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు.

46
ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు...

తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం... మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 23, సోమవారం) మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.

56
ఈ రాత్రి వర్షాలే వర్షాలు

ఇక రాత్రి సమయంలో కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. రంగారెడ్డి, నల్గొండ, భువనగిరి, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఇవాళ (సోమవారం) రాత్రి లేదంటే రేపు (మంగళవారం) తెల్లవారుజామున వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అక్కడక్కడ వడగళ్ల వానలు కురిసేందుకు కూడా ఛాన్సెస్ ఉన్నాయని హెచ్చరించారు.

66
తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఇక్కడే..

ఇక ఇప్పటికే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి... అత్యధికంగా కామారెడ్డి జిల్లా పిట్లంలో 17 మిల్లిమీటర్ల వర్షం నమోదయినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో 14.6, ఆదిలాబాద్ పట్టణంలో 10.2, సిర్పూరులో 10.2, తలమడుగులో 7.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

Read more Photos on
click me!

Recommended Stories