ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం..
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే... ఇవాళ (ఏప్రిల్ 26) రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. నేడు 23 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయంటోంది... అవి విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, వంగర... పార్వతీపురంమన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పార్వతీపురం, సాలూరు, సీతానగరం, వీరఘట్టం... అల్లూరి జిల్లాలోని జికే వీధి... పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాలు. ఈ మండలాల పరిధిలోని గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని APSDMA సూచించింది.
నిన్న (శనివారం) కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 44.8°C, కడపలో44.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 18 జిల్లాల్లోని 172 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇవాళ కూడా ఇదేస్థాయిలో ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని... కొన్నిచోట్ల తారాస్థాయికి చేరే అవకాశాలున్నాయని APSDMA హెచ్చరిస్తోంది.