Jobs: నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. ఆర్టీసీలో 3,038 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్

Published : Apr 20, 2025, 09:35 AM IST

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఉద్యోగాల క‌ల్ప‌న‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నాయి.  గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిరుద్యోగ ఫ్యాక్ట‌ర్ కీల‌క పాత్ర పోషించిన నేప‌థ్యంలో కొత్త‌గా ఏర్ప‌డ్డ రెండు ప్ర‌భుత్వాలు ఉద్యోగాల భ‌ర్తీ చేస్తున్నాయి.  ఇందులో భాగంగానే ఇప్ప‌టికే ప‌లు పోస్టుల భ‌ర్తీ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం మెగా డీఎస్సీని విడుద‌ల చేసింది. ఇదిలా ఉంటే తెలంగాణ‌లో కూడా ఉద్యోగాల భ‌ర్తీని పెద్ద ఎత్తున చేప‌డుతోంది ప్ర‌భుత్వం. ఇందులో భాగంగానే తాజాగా ఆర్టీసీలో పోస్టుల భ‌ర్తీ చేప‌ట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది..   

PREV
15
Jobs: నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. ఆర్టీసీలో 3,038 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్
Job vacancy

తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉద్యోగాల భ‌ర్తీకి అధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. డీఎస్సీ నిర్వ‌హించి టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీ చేప‌ట్టిన ప్ర‌భుత్వం గ్రూప్ పోస్టులను సైతం శ‌ర‌వేగంగా భ‌ర్తీ చేసింది. కాగా తాజాగా తెలంగాణ ఆర్టీసీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భ‌ర్తీ చేప‌ట్టేందుకు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 

25

త్వ‌ర‌లోనే తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.  ఈ పోస్టుల‌లో 2 వేల డ్రైవర్‌ పోస్టులు, 743 శ్రామిక్‌ ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్‌), 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానికల్‌), 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, 18 అసిస్టెంట్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ పోస్టులు, 23 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌), 11 సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌). 6 అకౌంట్‌ ఆఫీసర్స్‌, 7 మెడికల్‌ ఆఫీసర్స్‌ జనరల్‌, 7 మెడికల్‌ ఆఫీసర్స్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు ఉండ‌నున్నాయ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. 
 

35
TS RTC MD Sajjannar

త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. కాగా గ‌త కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఆర్టీసీ వైఎస్ ఛైర్మ‌న్ స‌జ్జ‌నార్ సైతం కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి ల‌భించింద‌ని తెలిపారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం వ‌ల్ల ఉద్యోగుల ప‌ని భారం ఎక్కువైంది. ఈ పోస్టుల భర్తీ అనంతరం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుందని స‌జ్జ‌నార్ అభిప్రాయ‌ప‌డ్డారు. 

45

ఎస్సీ వర్గీకరణతో మొదలు కానున్న ప్రక్రియ:

నిజానికి తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఏడాదికి గాను పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రణాళిక వేసుకుంది. అయితే షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొత్త నోటిఫికేషన్లను నిలిపివేసింది.  దీంతో కొంతకాలం నియామక ప్రక్రియ నిలిచిపోయింది. కానీ తాజాగా ఎస్సీ వర్గీకరణ చట్టంపై స్పష్టతకు రావడంతో, ఆ నిర్ణయాన్ని కేంద్రంగా చేసుకుని రోస్టర్‌ను ఫిక్స్ చేసి, నియామక ప్రక్రియను మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

55
public exam

ఇందులో భాగంగానే త్వరలోనే ఆర్టీసీ సహా పలు కీలక రంగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెలాఖరులోగా అంగన్వాడీల్లో 14,236 ఉద్యోగాలు, హెల్త్ డిపార్టుమెంట్‌లో 4 వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories