IMD Rain Alert : పిడుగులు, ఈదురుగాలుల బీభత్సం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Published : Oct 14, 2025, 03:15 PM ISTUpdated : Oct 14, 2025, 03:18 PM IST

IMD Rain Alert : తెలంగాాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ వర్షాలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో వర్షాల గురించి తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది.  

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మెల్లిగా మారుతున్నాయి. ఇప్పటికే ఓ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇప్పుడు బంగాళాఖాతం తీరంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని... ఈ వర్షాలకు పిడుగులు, ఈదురుగాలులు తోడయ్యే ప్రమాదముంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి.

25
తెలంగాణలో వర్షాలు

తాజాగా హైదరాబాద్ వాతావరణ ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో  హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఇవాళ (అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 15 ఉదయం వరకు) వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. 

35
అక్టోబర్ 15న తెలంగాణలో వర్షాలు

ఇక రేపు (అక్టోబర్ 15, బుధవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. కొద్దిరోజులుగా హైదరాబాద్ తో పాట మరికొన్ని జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంది... పెద్దగా వర్షాలు లేవు. కానీ మెల్లిగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరందుకుంటున్నాయి. రుతుపవనాల దేశాన్ని వీడినా వర్షాలు మాత్రం వీడటంలేదు.

45
తెలంగాణను వణికిస్తున్న చలి

తెలంగాణలో ఓవైపు వర్షాలు కొనసాగుతుండగానే మరోవైపు చలి పెరుగుతోంది. ఇలా ఇవాళ(బుధవారం) ఉదయం హైదరాబాద్ లో అత్యల్పంగా హయత్ నగర్ లో 21.6 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాజేంద్రనగర్ లో 22, బేగంపేటలో 22.3, హకీంపేటలో 23.7. పటాన్ చెరు ఈక్రిశాట్ ప్రాంతంలో 22 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని జిల్లాలవారిగా చూసుకుంటే ఆదిలాబాద్ లో అత్యల్పంగా 19.2, మెదక్ లో 19.6 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతాజిల్లాల్లో కూడా 20-25 డిగ్రీ సెంటిగ్రేడ్ నమోదవుతూ చలి తీవ్రత పెరిగింది.

55
ఏపీలో వర్షాలు... ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (అక్టోబర్ 14న) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, కర్నూలు,అనంతపురం, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో రెండ్రోజుల పాటు ఏపీలో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని APSDMA హెచ్చరించింది.

Read more Photos on
click me!

Recommended Stories