పరీక్ష పూర్తయ్యాక కేంద్రం నుంచి బయటకు వచ్చే విద్యార్థులు క్వశ్చన్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లడం సహజం. కానీ కొందరు విద్యార్థులు మాత్రం చేతిలో ఉన్న రఫ్ పేపర్లు, ప్రశ్నాపత్రాలు ఎలాంటి ఆలోచన లేకుండా రోడ్డుపై పడేస్తూ వెళ్లిపోతున్నారు. మరీ ముఖ్యంగా బస్సుల్లో వెళ్లే విద్యార్థులు బస్సు కిటికీల్లో నుంచి పేపర్లను బయటకు విసురుతున్నారు. దీంతో దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
24
సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ
ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “ఇది చదువుకున్న వారి ప్రవర్తనా?” అంటూ ప్రశ్నించారు. పబ్లిక్ ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇలా పేపర్లను చింపి పడేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
34
బాధ్యత ఎవరిది?
కొంతమంది మాత్రం పరీక్ష కేంద్రాల నిర్వహణపైనే ప్రశ్నలు లేవనెత్తారు. పేపర్లు వేసేందుకు డస్ట్‌బిన్లు లేదా ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. అదే విధంగా విద్యా సంస్థలు సైతం దీనిపై దృష్టిసారించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు తప్పకుండా తమ క్వశ్చన్ పేపర్లను తీసుకురావాలనే నిబంధన పెడితే ఇలాంటివి జరగవని అంటున్నారు.
ఈ ఘటన ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. విద్య అంటే కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడం కాదు. సమాజంలో బాధ్యతగా ఎలా ఉండాలి అన్నది కూడా నేర్చుకోవాలి. పబ్లిక్ ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి కర్తవ్యం. ఈ వైరల్ వీడియో చూడడానికిఇక్కడ క్లిక్ చేయండి.