వినాయ‌క నిమ‌జ్జ‌నం వేళ మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్ ఉచిత సేవ‌లు.. ఫుల్ ఖుషీ అవుతోన్న భ‌క్తులు

Published : Sep 06, 2025, 02:24 PM IST

తెలంగాణ వ్యాప్తంగా వినాయ‌క నిమ‌జ్జ‌న వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వంగా సాగుతోంది. హైద‌రాబాద్‌లో గ‌ణ‌నాథులు భారీగా గంగ‌మ్మ ఒడికి క్యూ క‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ ప్రైవేట్ హాస్పిట‌ల్ మెడిక‌వ‌ర్ భ‌క్తుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది. 

PREV
15
భక్తుల ఆరోగ్యం కోసం

వినాయక నిమ‌జ్జ‌న‌ వేడుకలకు హాజరయ్యే భక్తుల ఆరోగ్య భద్రత కోసం మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక అత్యవసర వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. భారీగా వచ్చే జనసందోహంలో ఎవరైనా అనారోగ్యానికి గురైనా వెంటనే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు.

25
వైద్యులు, నర్సులతో ప్రత్యేక బృందం

ఈ సేవల కోసం అనుభవజ్ఞులైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని ప్రత్యేక బృందంగా నియమించారు. అదనంగా ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనా స్పందించేందుకు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు.

35
ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు

భక్తుల సౌకర్యార్థం RBS (రాండమ్ బ్లడ్ షుగర్), రక్తపోటు (BP) వంటి ప్రాథమిక పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ చర్యతో అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి వెంటనే చికిత్స అందించడం సులభం అవుతుంది.

45
తాగునీటి సదుపాయం

ఆరోగ్య సేవలతో పాటు, నిమ‌జ్జ‌నానికి వచ్చే భక్తులు దాహం తీరేందుకు మెడికవర్ హాస్పిటల్స్ తాగునీటి బాటిళ్లను కూడా అందిస్తున్నారు. దీంతో వేడుకలో పాల్గొనే వారు సురక్షితంగా ఉండేందుకు సహాయపడుతుంది.

55
ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యం

మెడికవర్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మార్కెటింగ్ హెడ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్య భద్రత మాకు అత్యంత ప్రాధాన్యం. నిమ‌జ్జ‌నానికి వచ్చే ప్రతి ఒక్కరికి మా వైద్య బృందం అండగా ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా తక్షణ సేవలు అందించగలగడం మా సంతోషంగా భావిస్తున్నాం” అని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories