Hyderabad : నగరంలో రెండ్రోజులపాటు నీటి సరఫరా బంద్... ఏరోజు, ఏ ప్రాంతాల్లో నీళ్లురావో ఇక్కడ తెలుసుకొండి

Published : Sep 06, 2025, 01:15 PM IST

హైదరాబాద్ లో వచ్చేవారం రెండ్రోజులపాటు అంటే 48 గంటలు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. ఏయే ప్రాంతాల్లో నీటిసరఫరా ఉండదో HMWSSB ఇప్పటికే ప్రకటించింది… ఆ ప్రాంతాల ప్రజలను ముందుగానే అలర్ట్ చేస్తోంది. ఏ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదో తెలుసా?

PREV
15
హైదరాబాద్ లో రెండ్రోజులు మంచినీటి సప్లై ఉండదు..

Hyderabad : మహానగరం హైదరాబాద్ లో రెండ్రోజుల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది... ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లై ఆండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) కీలక ప్రకటన చేసింది. రిపేరింగ్ పనులకోసం దాదాపు రెండ్రోజులు (48 గంటలు) హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కాబట్టి నగర ప్రజలు ముందుగానే జాగ్రత్తపడాలి... నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు పొదుపుగా వాడుకోవాలి.

25
ఏరోజు హైదరాబాద్ లో నీటిసరఫరా బంద్

హైదరాబాద్ లో సెప్టెంబర్ 9 అంటే వచ్చే మంగళవారం ఉదయం 6 గంటల నుండి మంచినీటి సరఫరా బంద్ అవుతుంది. మళ్లీ 48 గంటల తర్వాత నీటి సరఫరా చేయనున్నారు... అంటే తిరిగి సెప్టెంబర్ 11న (గురువారం) నీళ్లు వస్తాయి. ఈరోజు ఉదయం 6 గంటలవరకు రిపేరింగ్ పనులు జరుగుతాయని హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి ప్రకటించింది... అంటే గురువారం ఉదయం మంచినీటి సరఫరా జరుగుతుంది.

అయితే రిపేరింగ్ పనులు ఆలస్యం అయితే నీటి సరఫరా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి నగరప్రజలు వచ్చే సోమవారమే రెండుమూడు రోజులకు సరిపడా నీటిని నిల్వచేసుకోవడం మంచిది. అంతేకాదు సెప్టెంబర్ 9 నుండి 11వ తేదీ ఉదయం వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలి.

35
హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లోనే 48 గంటలు నీటి సరఫరా బంద్...

1. ఓ అండ్ ఎం డివిజ‌న్- 6 (ఎస్‌.ఆర్‌.న‌గ‌ర్‌ పరిధి): ఎస్.ఆర్.నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎస్‌పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంకట్రావు నగర్, యెల్లారెడ్డిగూడ, సోమజిగూడ, ఫతేనగర్ సెక్షన్లు, జూబ్లీహిల్స్ కొంత భాగం, తాటిఖానా కొంత భాగం.

2. ఓ అండ్ ఎం డివిజ‌న్- 7: లాలాపేట్ కొంత భాగం, తార్నాకా కొంత భాగం.

3. ఓ అండ్ ఎం డివిజ‌న్- 9 : కూకట్‌పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, యెల్లమ్మబండ, మూసాపేట్, భరత్‌నగర్, మోతీనగర్, గాయత్రీనగర్, బాబానగర్, కెపిహెచ్‌బి, బాలాజీనగర్, హష్మత్పేట్ సెక్షన్.

4. ఓ అండ్ ఎం డివిజ‌న్- 12: చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్‌నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శనగర్, భగత్‌సింగ్‌నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ సెక్షన్.

5. ఓ అండ్ ఎం డివిజ‌న్- 8: అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, మచ్చబోలారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పేయి నగర్, యాప్రాల్, చాణక్యపురి, గౌతమ్‌నగర్, సాయినాథ్‌పురం సెక్షన్, మౌలాలి రిజర్వాయర్.

45
హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా ఉండదు

6. ఓ అండ్ ఎం డివిజ‌న్- 14: (కాప్రా మున్సిపాలిటీ పరిధి): చర్లపల్లి, సాయిబాబా నగర్, రాధికా సెక్షన్లు, కైలాసగిరి పాత, కొత్త రిజర్వాయర్ ప్రాంతాలు, హౌసింగ్ బోర్డు సెక్షన్, మల్లాపూర్ కొంత భాగం.

7. ఓ అండ్ ఎం డివిజ‌న్- 15: కొండాపూర్, డోయెన్స్, మాధాపూర్ కొంత భాగం, గచ్చిబౌలి కొంత భాగం, నల్లగండ్ల కొంత భాగం.

8. ఓ అండ్ ఎం డివిజ‌న్- 17: హఫీజ్‌పేట్, మియాపూర్ సెక్షన్లు.

9. ఓ అండ్ ఎం డివిజ‌న్- 19: పొచారం.

10. ఓ అండ్ ఎం డివిజ‌న్- 21: కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం సెక్షన్, అయ్యప్పకాలనీ రిజర్వాయర్ ప్రాంతాలు.

11. ఓ అండ్ ఎం డివిజ‌న్- 22: నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, తెల్లాపూర్, బోల్లారం, బౌరాంపేట్ సెక్షన్లు.

12. ట్రాన్స్‌మిషన్ డివిజ‌న్- 4: త్రిశూల్ లైన్స్, గన్‌రాక్, హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఏఐఐఎంఎస్బిబి నగర్.

13. గ్రామీణ నీటి సరఫరా (RWS) ఆఫ్‌టేక్స్: అలేర్ (భువనగిరి), ఘన్పూర్ (మేడ్చల్/శామీర్‌పేట్) ప్రాంతాలు.

55
హైదరాబాద్ లో ఎందుకు నీటి సరఫరా బంద్ అవుతుంది?

హైద‌రాబాద్ మ‌హాన‌గరానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్న గోదావ‌రి డ్రింకింగ్ వాట‌ర్ స‌ప్లై పేజ్-1 ప‌థ‌కంలో రిపేరింగ్ పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో 3000 మిమీ డయా ఎమ్.ఎస్. పంపింగ్ మెయిన్‌పై అమర్చబడిన 900 మిమీ డయా వాల్వులు మార్పిడి పనులు జ‌రుగుతున్నాయి. అందువల్లే నీటి సరఫరాను నిలిపేసి పనులు చేపట్టనున్నారు... కాబట్టి 48 గంటలు హైదరాబాద్ కు నీటి సరఫరా ఉండటంలేదు.

ఇలా పైన పేర్కొన్న డివిజ‌న్ ప్రాంతాలకు సూచించిన తేదీలలో నీటి సరఫరా నిలిపివేయబడుతుంది. కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని హైదరాబాద్ వాటర్ సప్లై బోర్డు ఉన్నతోద్యుగులు సూచిస్తున్నారు.. స్థానిక సిబ్బంది కూడా నీటి సరఫరా బంద్ పై ప్రజలకు సమాచారం అందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories