Hyderabad: మాదాపూర్‌, గ‌చ్చిబౌలి కాదు.. ఈ ఏరియాలో పెట్టుబ‌డి పెడితే మీ రాత మారిపోతుంది.

Published : Jun 10, 2025, 03:59 PM IST

రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెడితే న‌ష్టం అనేది ఉండ‌ద‌ని చాలా మంది భావిస్తుంటారు. మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాద్ లాంటి న‌గ‌రంలో పెట్టుబ‌డి పెట్టేందుకు చాలా మంది మొగ్గు చూపుతుంటారు. ప్ర‌స్తుతం త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులో ఉన్న ఏరియా గురించి తెలుసుకుందాం. 

PREV
15
ఐటీ కారిడార్ మాత్ర‌మే కాదు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ గురించి మాట్లాడితే చాలామంది మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఐటీ కారిడార్‌నే గుర్తు చేస్తారు. అయితే ఆ ప్రాంతాల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

అక్కడ ఇళ్లు కొనే వారు కంటే పెట్టుబడి పెట్టే వాళ్లే ఎక్కువ. కానీ, నిజంగా జీవించేందుకు ఇల్లు కొనే మధ్యతరగతి కుటుంబాలు మాత్రం అందుబాటులో ఉన్న ఇతర ప్రాంతాలవైపే మొగ్గు చూపుతున్నాయి. అలాంటి అవకాశాలున్న ప్రాంతాల్లో తొర్రూరు ఒక‌టి.

25
విజయవాడ హైవే పక్కనే

తొర్రూరు, రంగారెడ్డి జిల్లాలో హయత్‌నగర్ మండలంలో ఉంది. ఇది విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65) పక్కన ఉండటంతో, ట్రాన్స్‌పోర్ట్, కనెక్టివిటీ బాగుంటుంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) కూడా చేరువ‌లో ఉండ‌డంతో న‌గ‌రంలో ఏ ప్రాంతానికైనా ఇట్టే చేరుకునే వెసులుబాటు ఉంటుంది.

పక్కనే ఉన్న ఎల్.బి. నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాల‌తో అన్ని ర‌కాల సౌక‌ర్యాలు ఉన్నాయి. వీటితో పాటు స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ చుట్టుపక్కలే ఉన్నాయి.

35
రియల్ ఎస్టేట్ బూమ్

తొర్రూరులో ప్రస్తుతం అత్యధికంగా ఓపెన్ ప్లాట్‌లు అమ్మకానికి ఉన్నాయి. ఇందులో చాలా వరకు ధరలు చదరపు గజానికి రూ. 15,000 – రూ. 25,000 మధ్య ఉంటున్నాయి. అన్ని అనుమతులు ఉన్న లే ఔట్లకు (HMDA/DTCP Layouts) ధర కాస్త ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాలు నిర్మించడం ప్రారంభించాయి. అలాగే చిన్న బిల్డర్లు ఇండిపెండెంట్ హౌసులు, చిన్న అపార్టుమెంట్లు కూడా నిర్మిస్తున్నారు.

45
అపార్ట్‌మెంట్స్‌లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.?

తొర్రూరులో 2BHK అపార్టుమెంట్ ధరలు రూ. 40 లక్షల నుండి రూ. 60 లక్షల వరకు ఉంటున్నాయి. ఇది హైదరాబాద్ మిగతా ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. కాబ‌ట్టి మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గానికి ఇదొక బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

ఇటీవల ప్లాట్లపై పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. దీర్ఘకాలికంగా చూస్తే, రాబోయే 5-10 ఏళ్లలో ఈ ప్రాంతంలో అభివృద్ధి విస్తరిస్తుందనే నమ్మకం పెట్టుబడిదారులలో ఉంది.

55
భ‌విష్య‌త్తులో మంచి రిట‌ర్న్స్

తొర్రూరు ఒకవైపు సకల సౌకర్యాలు కలిగిన నివాస ప్రాంతంగా ఉండగా, మరోవైపు భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఆశించగలిగే ఇన్వెస్ట్‌మెంట్ హబ్ గా కూడా అభివృద్ధి చెందుతోంది. ప్లాట్లు కొంటే భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే న‌గ‌రానికి శివారు ప్రాంతంలో ఉండ‌డంతో ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories