నేడు తెలంగాణలో వర్షాలే వర్షాలు... ఈ జిల్లాలకు అలర్ట్
తెలంగాణలో ఈ రెండ్రోజులు (జూన్ 10,11) మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతపవనాల కదలికలకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో తిరిగి వర్షాలు ప్రారంభమయ్యాయి.
నేడు(మంగళవారం) తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. నగరంలో చాలాప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయని... కొన్నిచోట్ల వర్షం కురవకున్న ఆకాశం మేఘాలతో కప్పివుండి వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు.
ఇక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, వనపర్తి, నారాయణపేట, మెదక్, కామారెడ్డి. నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.