సొంత ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే సొంత ఇల్లు కొనేందుకు బెస్ట్ టైమ్ ఈ దీపావళి పండగనే. పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నాయి.
సొంత ఇల్లు కొనాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఇల్లు కొనాలనుకుంటే ఈ దీపావళి బెస్ట్ సీజన్ అని చెప్పుకోవాలి. ఇల్లు కొనాలనుకునే వారికి ఈ పండుగ సీజన్లో భారీ డిస్కౌంట్లు దొరికే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాల కంటే కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ వేగంగా జరుగుతోంది. దీనివల్ల లక్షలాది ఇళ్లు అమ్ముడుపోకుండా ఖాళీగా పడి ఉన్నాయి. దీంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా నెమ్మదించాయి. అందుకే బిల్డర్లు ఈ పండుగ సీజన్ను టార్గెట్ చేసి, మిగిలిపోయిన ఇళ్లను త్వరగా అమ్మేయాలని చూస్తున్నారు.
23
హైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య
మనదేశంలోని చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రధాన మెట్రో నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 12 శాతం పెరిగింది. అంటే 6.31 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఈ సంఖ్య 5.62 లక్షలుగా ఉండేది. సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త ఇళ్ల అమ్మకాలు కేవలం 3 శాతం మాత్రమే పెరిగి 1,00,220 ఇళ్లు అమ్ముడయ్యాయి. కానీ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఇళ్ల సంఖ్య 18% పెరిగి 1.14 లక్షలకు చేరింది. అందుకే ఖాళీ ఇళ్ల సంఖ్య అమాంతం పెరిగింది.
33
ఇల్లు కొనడానికి ఇదే సరైన సమయం ఎందుకు?
హైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్లు అధికంగా ఉండడంతో ఈ పండుగ సీజన్లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీరు సొంత ఇల్లు కొనాలనుకుంటే ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. అలాగే రెపో రేటు పెంపు వల్ల బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.
ఇళ్ల ధరలు విపరీతంగా పెరగడమే ఇంటి అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం. ఉదాహరణకు బెంగళూరులో రెండేళ్ల క్రితం రూ.40-75 లక్షలు ఉన్న 2 BHK ఇళ్ల ధరలు ఇప్పుడు రూ.1 కోటి దాటాయి. చెన్నై, ముంబై, హైదరాబాద్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీంతో సామాన్యులు ఇల్లు కొనే ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. హైదరాబాద్ లో కూడా ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎంతో మంది ఇల్లు కొనే ఆలోచనను పక్కన పెడుతున్నారు.