Dasara Holidays 2026 : దసరా హాలిడేస్ అక్టోబర్ 25 వరకు పొడిగిస్తారా? 13 కాదు 16 రోజులు సెలవులేనా?

Published : Oct 15, 2026, 04:23 PM IST

తెలంగాణలో అక్టోబర్ 22 వరకు దసరా సెలవులున్నాయి… ఈ హాలిడేస్ ను అక్టోబర్ 25 వరకు పొడిగిస్తారనే ప్రచారం సాగుతోంది. నిజంగానే సెలవులు పొడిగించే అవకాశాలున్నాయా?

PREV
14
తెలుగు స్టూడెంట్స్ కి దసరా సెలవులు పెరుగుతాయా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు కొనసాగుతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు అక్టోబర్ 10 నుండి హాలిడేస్ ప్రారంభమయ్యాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో అక్టోబర్ 21 (వచ్చే బుధవారం) వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి... అక్టోబర్ 22 (గురువారం) స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణలో అక్టోబర్ 22 వరకు సెలవులు కొనసాగున్నాయి... అక్టోబర్ 23న (శుక్రవారం) బడులు తిరిగి తెరుచుకుంటాయి. అయితే విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికయితే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవుల పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు... కానీ విద్యార్థులు, వారి పేరెంట్స్ లో సెలవులపై ఆశలు సజీవంగానే ఉన్నాయి.

24
తెలంగాణలో దసరా సెలవులు పొడిగిస్తారా?

తెలంగాణలో దసరా సెలవుల పొడిగింపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సరిగ్గా వీకెండ్ సమయంలో ఇప్పుడిచ్చిన సెలవులు ముగుస్తాయి... కాబట్టి ఒకటి రెండ్రోజులు పొడిగిస్తే ఆదివారం కూడా కలిసివస్తుంది. ఇలా మరో మూడ్రోజులు సెలవులు వస్తాయి... సోమవారం నుండి ప్రెష్ గా స్కూళ్లు తెరవాలని పేరెంట్స్ డిమాండ్ చేసే అవకాశాలున్నాయి.

తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ 22న (గురువారం) ముగుస్తాయి... అక్టోబర్ 23న అంటే శుక్రవారం స్కూళ్లు తెరుచుకోవాలి. అయితే హైదరాబాద్ లో ఐటీ, కార్పోరేట్ ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే స్కూల్స్ కి ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. అంటే ఇలాంటి స్కూల్స్ దసరా సెలవులు ముగిశాక ఒక్కరోజే నడుస్తాయి... తిరిగి అక్టోబర్ 24, 25 (శని, ఆదివారం) మళ్లీ సెలవులే.

ఇక ఇతర స్కూల్స్ కి కూడా దసరా సెలవులు ముగిశాక రెండ్రోజులు స్కూళ్లు నడుస్తాయో లేదో ఆదివారం సెలవు వస్తుంది. కాబట్టి దసరా సెలవులు రెండ్రోజులు పొడిగిస్తే సండే కలిసివస్తుంది... మొత్తంగా మరో మూడ్రోజులు సెలవులు వస్తాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. అందుకే అక్టోబర్ 22 వరకు ఇచ్చిన దసరా సెలవులను అక్టోబర్ 25 వరకు పొడిగించాలనే డిమాండ్ చేయవచ్చు. ప్రభుత్వం ఒప్పుకుంటే మాత్రం 13 రోజుల దసరా సెలవులు కాస్త 16 రోజులు కానున్నాయి.

34
ఆంధ్ర ప్రదేశ్ సంగతేంటి?

ఆంధ్ర ప్రదేశ్ లో దసరా సెలవుల పొడిగింపు ఉండకపోవచ్చు. తెలంగాణలో బతుకమ్మ, దసరా పండగలను ఘనంగా జరుపుకుంటారు... ఏపీలో దసరాను సాధారణ పండగలాగే చేసుకుంటారు... వీరికి సంక్రాంతి పెద్దపండగ. అందుకే ముందుగానే తెలంగాణ కంటే ఓరోజు తక్కువగానే ఏపీలో దసరా సెలవులు ఇచ్చారు. దీన్నిబట్టి సెలవులను పొడిగించే అవకాశాలు లేవని అర్థమవుతుంది... విద్యార్థులు, పేరెంట్స్ నుండి కూడా ఈ డిమాండ్ రాకపోవచ్చు.

అయితే పండగ సెలవుల్లో హైదరాబాద్ నుండి తమ స్వస్థలాలకు వెళ్లిన ఆంధ్ర విద్యార్థులు, తల్లిదండ్రులు మాత్రం అక్టోబర్ 25 వరకు అక్కడే ఉండనున్నారు. అక్టోబర్ 26 వరకు హైదరాబాద్ కు చేరుకుని పిల్లలను స్కూళ్లకు పంపిస్తారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగిస్తే ఇలాంటివారికి ఊరట లభించనుంది.

44
ఇంటర్మీడియట్ కాలేజీలకు ఎప్పటివరకు సెలవులు?

తెలంగాణలో కేవలం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కి మాత్రమే దసరా సెలవులు అక్టోబర్ 10 నుండి 22 వరకు ఇచ్చారు. అదే యువతకు అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు అక్టోబర్ 21 వరకు మాత్రమే సెలవులున్నాయి. అంటే ఇంటర్ విద్యార్థులకు స్కూల్ స్టూడెంట్స్ కంటే ఓరోజు ముందుగానే సెలవులు ముగుస్తాయి... వీరికి హాలిడేస్ పొడిగించే అవకాశాలు లేవు. కాలేజీ విద్యార్ధులు 12 రోజుల సెలవులతోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో స్కూళ్లతో పాటు ఇంటర్ కాలేజీలకు కూడా అక్టోబర్ 21 వరకే దసరా సెలవులు ఇచ్చారు. కాబట్టి అన్ని విద్యాసంస్థలకు అక్టోబర్ 22న తెరుచుకుంటాయి.. ఇక్కడ సెలవుల పొడిగింపు అనే అంశమే ఉండకపోవచ్చు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో స్కూళ్లకి దసరా సెలవులు పొడిగించే అవకాశాలున్నాయి… ఏపీలో మాత్రం అస్సలు అవకాశం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories