TG SSC Results: కాసేప‌ట్లో తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు.. అంద‌రి కంటే ముందు వాట్సాప్‌లో ఇలా తెలుసుకోండి

Published : Apr 29, 2026, 08:10 AM IST

TG SSC Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు సమయం ఆస‌న్న‌మైంది. బుధ‌వారం (నేడు) మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. 

PREV
15
మ‌ధ్యాహ్నం ఫలితాల విడుదల

పదో తరగతి ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు అధికారికంగా విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని గోదావరి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా. యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డా. నవీన్ నికోలస్ పాల్గొననున్నారు.

25
పరీక్షల షెడ్యూల్, విద్యార్థుల హాజరు

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ మధ్య వరకు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. అన్ని పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి.

35
వేగంగా పూర్తైన మూల్యాంకన ప్రక్రియ

పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 23 నాటికే ఈ ప్రక్రియ ముగియడంతో, ముందుగా అనుకున్న సమయం కంటే ముందే ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.

45
ఆన్‌లైన్, వాట్సాప్ ద్వారా ఫలితాలు

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లు results.bse.telangana.gov.in, bse.telangana.gov.inలో హాల్‌టికెట్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. అదే విధంగా, ఈసారి కొత్తగా వాట్సాప్ సేవను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. 8096958096 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి, సూచనల ప్రకారం వివరాలు నమోదు చేస్తే ఫలితం మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

55
ముందుగానే ఫ‌లితాలు

నిజానికి తొలుత మొదట మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటించాలని భావించినా, ప్రక్రియ వేగంగా పూర్తవడంతో ముందుగానే విడుదల చేస్తున్నారు. ఇది ఇంటర్, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో అడ్మిషన్లకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడనుంది.

Read more Photos on
click me!

Recommended Stories