TG Police Recruitment 2026: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఎంత? జీతం, క్వాలిఫికేషన్, నెగెటివ్ మార్కింగ్ ఫుల్ డీటైల్స్

Published : Jul 30, 2026, 08:10 AM IST

TG Police Recruitment 2026: తెలంగాణలో 7,437 పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం TSLPRB నోటిఫికేషన్ జారీ చేసింది. ఏజ్ లిమిట్, అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్ సహా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
7,437 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వచ్చేసింది

తెలంగాణలో యూనిఫామ్ వేసుకోవాలని, ఖాకీ డ్రెస్సులో సమాజానికి సేవ చేయాలని కలలు కనే నిరుద్యోగ యువతకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) బుధవారం భారీ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది.

పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న ఏకంగా 7,437 ఉద్యోగాల భర్తీ కోసం ఒకేసారి 4 వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. చాలా కాలంగా ప్రిపరేషన్‌లో ఉన్న అభ్యర్థులకు ఇది నిజంగా గోల్డెన్ ఆపర్చ్యునిటీ అని చెప్పాలి.

25
డిపార్ట్‌మెంట్ వారీగా ఖాళీల వివరాలు ఇవే

ఈ నోటిఫికేషన్ ద్వారా వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేయనున్నారు. శాఖల వారీగా వివరాలను పరిశీలిస్తే..

పోలీస్ శాఖ (SI, ASI)

  • సబ్ ఇన్ స్పెక్టర్ (సివిల్): 148
  • రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (AR): 14
  • రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (TGSP): 12
  • రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ (SARCPL): 3
  • అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (FPB): 23

పోలీస్ కానిస్టేబుల్ విభాగం

  • కానిస్టేబుల్ (సివిల్): 3,697
  • కానిస్టేబుల్ (AR): 1,052
  • కానిస్టేబుల్ (SARCPL): 24
  • డ్రైవర్ PTO: 20
  • మెకానిక్ PTO: 7

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)

  • సబ్ ఇన్ స్పెక్టర్: 44
  • కానిస్టేబుల్: 1,380

ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్

  • స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39
  • ఫైర్ ఫైటర్: 751

జైళ్ల శాఖ

  • డిప్యూటీ జైలర్ (పురుషులు): 14 | డిప్యూటీ జైలర్ (మహిళలు): 1
  • వార్డర్ (పురుషులు): 196 | వార్డర్ (మహిళలు): 12

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 24,280 నుండి రూ. 72,850 వరకు పే స్కేల్ లభిస్తుంది.

35
పోలీసు ఉద్యోగాల వయోపరిమితి ఎంత? GO 87తో ప్రయోజనం ఏంటి?

చాలామంది అభ్యర్థులకు ఏజ్ లిమిట్ విషయంలో అనేక అనుమానాలు ఉంటాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ (GO Ms No. 87, తేదీ: 18-05-2026) ద్వారా యూనిఫామ్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిలో సాధారణ అభ్యర్థులందరికీ అదనంగా 5 సంవత్సరాల సడలింపు లభించింది.

కానిస్టేబుల్ పోస్టులకు

  • కనీస వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి (జూలై 1, 2026 నాటికి).
  • జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి సాధారణంగా 22 ఏళ్లు కాగా, ప్రభుత్వ 5 ఏళ్ల సడలింపుతో 27 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఈ 27 ఏళ్లకు అదనంగా మరో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అంటే వీరు 32 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు:

  • కనీస వయస్సు 21 ఏళ్లు ఉండాలి.
  • జనరల్ కేటగిరీకి సాధారణ వయోపరిమితి 25 ఏళ్లు. జీఓ 87 ప్రకారం 5 ఏళ్ల సడలింపు కలసి 30 ఏళ్ల వరకు పెరిగింది.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 ఏళ్ల మినహాయింపు ఉండటంతో వారు 35 సంవత్సరాల వయస్సు వరకు పోటీ పడవచ్చు.
45
పోలీసు ఉద్యోగాల విద్యా అర్హతలు, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2026 జులై 29 నాటికి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హతలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతకంటే ఎక్కువ చదివిన వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. ఫైర్ ఫైటర్ పోస్టులకు మాత్రం ఎల్ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది..

1. ప్రిలిమినరీ రాత పరీక్ష: 200 మార్కులకు, 3 గంటల వ్యవధిలో ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 20% నెగెటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. క్వాలిఫైయింగ్ మార్కులు: OC/EWS లకు 30%, BC లకు 25%, SC/ST/ఎక్స్-సర్వీస్‌మెన్/హోంగార్డులకు 20%.

2. ఫిజికల్ మెజర్‌మెంట్ & ఎఫిషియెన్సీ టెస్ట్ (PMT/PET): పురుషులు 1,600 మీటర్ల రన్ 7 నిమిషాల 15 సెకన్లలో, మహిళలు 800 మీటర్ల రన్ 5 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేయాలి. ఎత్తు పురుషులకు కనీసం 167.6 సెం.మీ, మహిళలకు 152.5 సెం.మీ ఉండాలి (ఏజెన్సీ ప్రాంతాల ST అభ్యర్థులకు సడలింపు ఉంటుంది). అలాగే లాంగ్ జంప్, షాట్‌పుట్ ఈవెంట్లు ఉంటాయి.

3. ఫైనల్ రాత పరీక్ష: ఫిజికల్ టెస్టులలో క్వాలిఫై అయిన వారికి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. పోస్టును బట్టి 100 లేదా 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

55
ఆన్‌లైన్ దరఖాస్తు విధానం.. సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికెట్లు

అభ్యర్థులు TSLPRB అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం, ముగింపు తేదీలను రిక్రూట్‌మెంట్ బోర్డ్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.

ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు

  • 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు బోనాఫైడ్ (లొకాలిటీ కోసం) లేదా నివాస ధృవీకరణ పత్రం.
  • ఏప్రిల్ 1, 2026 తర్వాత జారీ చేసిన బీసీ కేటగిరీ నాన్-క్రీమీలేయర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.
  • ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు తమ ఉపకుల వర్గీకరణ స్పష్టంగా ఉండేలా కుల ధృవీకరణ పత్రం.
  • అప్‌లోడ్ చేయడానికి ఫొటో, సంతకం కలిపిన JPG ఫైల్ (సైజ్: 30KB నుండి 100KB మధ్య ఉండాలి).

నోటిఫికేషన్‌లో పేర్కొన్న శారీరక, వైద్య ప్రమాణాలకు తాము సరిపోతామో లేదో తెలుసుకోవడానికి దరఖాస్తు చేయడానికంటే ముందే ఒకసారి సివిల్ సర్జన్‌తో పరీక్షించుకోవడం మంచిదని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ స్పష్టం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories