Weather Update: తెలంగాణలో ఎండల సెగ తగ్గుముఖం పట్టనుంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూల్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. మే 29 (శుక్రవారం) వరకు నగరానికి 'ఎల్లో అలర్ట్' జారీ చేస్తూ ఐఎండీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది.
26
ఎండల నుంచి ఊరట.. భాగ్యనగరం కూల్ కూల్
గత కొద్ది రోజులుగా భానుడు భగభగలాడుతూ చుక్కలు చూపించాడు. హైదరాబాద్ లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే, మంగళవారం రాత్రి నుంచి అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు సీన్ మార్చేశాయి. సికింద్రాబాద్, అమీర్‌పేట్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి ఏరియాల్లో వాతావరణం చల్లబడటంతో జనం హమ్మయ్య అనుకుంటున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది.
36
అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాలను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు ఎలాంటి కష్టం రాకూడదని సీఎం నొక్కి చెప్పారు.
హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి సహా 20కి పైగా జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. బలమైన గాలుల వల్ల చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, వర్షం పడే సమయంలో బయట తిరగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
56
నైరుతి రుతుపవనాల రాక లేట్.. ఎందుకంటే?
సాధారణంగా జూన్ 1 కల్లా కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి కొంచెం ఆలస్యమయ్యేలా ఉన్నాయి. మే 26న రావాల్సినవి ఇప్పుడు జూన్ 2 నుంచి 4 మధ్య వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీనివల్ల ఉత్తర భారతం ఎండలతో అల్లాడుతోంది. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా టెంపరేచర్స్ వెళ్తున్నాయి. అయితే, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కేవలం వాతావరణ మార్పుల వల్ల వస్తున్న ప్రీ-మాన్సూన్ వర్షాలే అని ఈ రంగం నిపుణులు చెబుతున్నారు.
66
ఉరుములు, మెరుపులతో వర్షం.. జాగ్రత్తలు తీసుకోండి
ఆఫీసులకి వెళ్లేవారు లేదా పనుల మీద బయట తిరిగేవారు తమ షెడ్యూల్‌ను వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం బెటర్. సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే ఛాన్స్ ఉంది కాబట్టి వెంట గొడుగు లేదా రెయిన్ కోట్ ఉంచుకోవడం మంచిది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో వైరల్ ఫీవర్లు వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.