• సోమవారం : మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. కానీ, ఇదే టైంలో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాలులు కూడా వీస్తాయి. ఆల్రెడీ 102 మండలాల్లో హీట్‌వేవ్ నడుస్తోంది, అందులో 33 మండలాల్లో పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది.
• మంగళవారం: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వానలు ఉన్నాయి.
• జూన్ 25 - 26: ఈ రెండు రోజులు వానల పీక్ స్టేజ్ అనొచ్చు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వానలు దంచికొడతాయి.