Telangana: తెలంగాణ టీచర్లకు గుడ్ న్యూస్‌..ఒకేసారి 2 వేల మందికి ప్రమోషన్లు!

Published : Jun 25, 2025, 02:48 PM IST

తెలంగాణలో 2 వేల మందికి పైగా ఉపాధ్యాయులకు గెజిటెడ్ హెడ్‌మాస్టర్ పదోన్నతులు లభించే అవకాశం. విద్యాశాఖ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదం కోరుతోంది.

PREV
16
ఉపాధ్యాయులకు శుభవార్త

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు శుభవార్త. రాష్ట్రంలో గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ (GHM) పదోన్నతులు కల్పించేందుకు విద్యాశాఖ కీలక చర్యలు చేపట్టింది. ఇటీవలే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ పదోన్నతులపై తయారు చేసిన ఫైల్‌ను విద్యాశాఖ కార్యదర్శికి పంపించింది.

ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిస్తే, మొత్తం 2 వేల మందికి పైగా ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందనున్నారు. గతేడాది 1,500 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లు GHMలుగా పదోన్నతులు పొందిన నేపథ్యంలో, ఇదొక భారీ ప్రక్రియగా నిలవనుంది.

26
750కు పై ఖాళీలు

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 750కు పైగా GHM పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్‌ మల్టీజోన్‌-2లో పదవీ విరమణల వల్ల, ఇతర కారణాల వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ పోస్టులకు రెగ్యులర్ GHMలను నియమించాలంటే, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం, రెగ్యులర్ హెడ్‌మాస్టర్లు లేని పాఠశాలల్లో ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు

36
1,500 మంది టీచర్లు ప్రమోషన్

ఈ ప్రమోషన్‌ల భాగంగా, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTలు) స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందే అవకాశముంది. ఈ రెండు దశల ప్రక్రియ ద్వారా మొత్తం 1,500 మంది టీచర్లు ప్రమోషన్ పొందనున్నారు.

ఇంకా, 2012 DSC తర్వాత నియమితమైన పీఈటీలు, భాషా పండితుల పోస్టులు స్కూల్ అసిస్టెంట్‌గా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ అమలైతే అదనంగా 800 మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించనున్నాయి.

46
విద్యాశాఖ వద్ద పెండింగ్‌లో

ప్రస్తుతం ఈ ఫైల్ విద్యాశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ ఆమోదం త్వరలోనే వచ్చే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ వర్గాలు ఆశతో ఎదురు చూస్తున్నాయి. "ఎంతోకాలంగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నాం, వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలి" అనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

56
పదోన్నతులు రాలేదు

గతేడాది PETలు, భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేశారు

కానీ DSC-2012 తర్వాత వచ్చిన టీచర్లకు పదోన్నతులు రాలేదు

ఇప్పుడవారికి కూడా పదోన్నతులు కల్పించే ప్రతిపాదన సిద్ధం

లబ్ధిపొందే ఉపాధ్యాయుల సంఖ్య: దాదాపు 800 మంది

66
ప్రమోషన్‌లు ఎలా జరుగుతాయి?

 దశ 1: SGT (సెకండరీ గ్రేడ్ టీచర్లు)లకు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు

దశ 2: స్కూల్ అసిస్టెంట్లకు GHMలుగా పదోన్నతులు

Read more Photos on
click me!

Recommended Stories