Free Bus Scheme: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకొని మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చేందుకు కొందరు కండెక్టర్లు నిరాకరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కొనసాగుతోంది. అయితే ఆధార్ కార్డులో రాష్ట్రం పేరుతో సంబంధం ఉన్న కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇచ్చారు.
DID YOU KNOW ?
తెలంగాణ చిరునామా ఉన్నా..
ఆధార్‌లో తెలంగాణ చిరునామా ఉంటే చాలు, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌గానే ఉన్నా ఉచిత ప్రయాణం అనుమతిస్తామని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్.
25
రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్‌గా ఉండటం వల్ల సమస్య
రాష్ట్ర విభజనకు ముందు తీసుకున్న ఆధార్ కార్డుల్లో ఇప్పటికీ State Name "ఆంధ్రప్రదేశ్"గా కనిపిస్తోంది. స్థానిక చిరునామా తెలంగాణలో ఉన్నప్పటికీ, రాష్ట్రం పేరు పాతదిగా ఉండటంతో కొంతమంది కండక్టర్లు మహిళలకు ఫ్రీ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
35
అధికారుల వివరణ
గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ ఈ విషయంలో స్పష్టతనిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఆధార్ కార్డులో తెలంగాణ పరిధిలోని చిరునామా ఉంటే సరిపోతుంది. రాష్ట్రం పేరు "ఆంధ్రప్రదేశ్"గా ఉన్నా కూడా ఉచిత ప్రయాణానికి అనుమతించాలి. ఆధార్ కార్డు తప్పనిసరి కాకుండా వోటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం ఇచ్చిన రెసిడెన్షియల్ ఐడీ కూడా చెల్లుబాటు అవుతాయి.
ఒకవేళ కండక్టర్లు మహిళలకు ఉచిత టికెట్ ఇవ్వడాన్ని నిరాకరిస్తే, వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్ 040 69440000 అందుబాటులో ఉంచారు. ఈ నంబరులో ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
55
ఆధార్ కార్డులు అప్‌డేట్ చేసుకోవడం మంచిది
ఆర్టీసీ అధికారులు స్పష్టతనిచ్చినప్పటికీ, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా మహిళలు తమ ఆధార్ కార్డులను తెలంగాణ రాష్ట్రం పేరుతో అప్‌డేట్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఆధార్ సెంటర్లలో చిరునామా లేదా రాష్ట్రం పేరు సరిచేసే అవకాశం ఉంది. ఇలా చేస్తే ఉచిత బస్సు ప్రయాణంలో ఎటువంటి సమస్యలు ఎదురుకావు.