Holiday Cancelled : తెలంగాణ స్టూడెంట్స్, ఎంప్లాయిస్ నవ్వాలా, ఏడవాలా..? ఈ శనివారం సెలవిచ్చి మరో సెలవు లాక్కున్నారే..!

Published : Sep 04, 2025, 09:33 AM IST

తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితి… ఓ సెలవు అదనంగా ఇచ్చినట్లు ఇచ్చి మరో సెలవును లాగేసుకుంది ప్రభుత్వం. ఇచ్చిన సెలవేది.. రద్దుచేసిన సెలవేదో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
తెలంగోళ్ళది వింత పరిస్థితి...

School Holidays : తెలంగాణ ప్రభుత్వం ఒకే ప్రకటనలో విద్యార్థులు, ఉద్యోగులకు తీపి, చేదు వార్త చెప్పింది. దీంతో గుడ్ న్యూస్ చూసి నవ్వాలో... బ్యాడ్ న్యూస్ చూసి ఏడవాలో తెలియని వింత పరిస్థితి వీరు ఎదుర్కొంటున్నారు. ఇంతకూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన ఏమిటి? ఇందులో గుడ్ న్యూస్ ఏమిటి? బ్యాడ్ న్యూస్ ఏమిటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

DID YOU KNOW ?
ఏపీ దసరా సెలవులు
ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇచ్చారు.
25
ఈ శనివారం జనరల్ హాలిడే

తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి. వాడవాడలా ప్రతిష్టించిన బొజ్జ గణపయ్య విగ్రహాలను ప్రజలు భక్తిశ్రద్దలతో పూజిస్తున్నారు... యువత సందడి, చిన్నారుల ఆటపాటలు, భజనలు, భక్తి పాటలతో కాలనీలు కళకళలాడుతున్నాయి. అయితే వినాయక నిమజ్జనానికి సమయం దగ్గరపడుతోంది... ప్రతిష్టించిన 11 రోజుల తర్వాత స్వామివారి విగ్రహాలను ఊరేగింపుగా తరలించి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇలా ఈ శనివారం తెలంగాణలో నిమజ్జన వేడుకలు జరగనున్నాయి... ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల శివారు జిల్లాల్లో వినాయక నిమజ్జన వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. హుస్సెన్ సాగర్ తో పాటు నగరంలోని పలు చెరువుల వద్ద గణపతి విగ్రహాల కోలాహలం నెలకొంటుంది. నగరంలో భారీగా ఊరేగింపులు జరుగుతాయి... గణపయ్య విగ్రహాలు, ప్రజలతో రోడ్లన్ని నిండిపోతాయి. ఇలా నిమజ్జన వేడుకల నేపథ్యంలో జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు శివారులోని మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో అధికారికంగా సెలవు ప్రకటించారు. ఈ శనివారం (సెప్టెంబర్ 6న) సాధారణ సెలవు ఉంటుందని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

35
వరుసగా మూడ్రోజులు సెలవులే

వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం అధికారిక సెలవు ప్రకటించడంతో తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా మూడ్రోజుల సెలవులు కలిసివస్తున్నాయి. రాష్ట్రంలో ఇవాళ(గురువారం) ఒక్కరోజే స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులు నడిచేది... రేపట్నుంచి మూడురోజుల పాటు సెలవులే. రేపు(శుక్రవారం) ముస్లింలు తమ ఆరాధ్యదైవం మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈద్ మిలాదున్ నబీ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకే కాదు ఆఫీసులకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

ఇక శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవు. ఆదివారం ఎలాగూ సాధారణ సెలవే. ఇలా తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు వస్తున్నాయి... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారింది. అయితే వరుసగా మూడ్రోజుల సెలవులు కేవలం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల విద్యాసంస్థలు, ఆఫీసులకు వర్తిస్తాయి... మిగతాజిల్లాల్లో శనివారం వర్కింగ్ డే ఉంటుంది… శుక్ర, ఆది రెండ్రోజులే సెలవులు. ఇలా వరుస సెలవులతో హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం.

45
రెండో శనివారం సెలవు రద్దు

ఈ శనివారం (సెప్టెంబర్ 6న) వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అధికారిక సెలవు ఇస్తున్నట్లు విడుదలచేసిన ప్రకటనలోనే మరో సమాచారం కూడా ఉంది. ఈ శనివారం సెలవుకు బదులు వచ్చేనెల (అక్టోబర్ 11న) రెండో శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు... ఆరోజు విద్యాసంస్థలు, ఆఫీసులు పనిచేస్తాయని ప్రకటించింది. ఇలా ఓ సెలవు ఇచ్చినట్లే ఇచ్చి మరోసెలవు లాగేసుకుంది ప్రభుత్వం. ఇది విద్యార్థులు, ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

55
దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?

తెలంగాణలో ఎప్పటిలాగే ఈసారి కూడా దసరా వేడుకలు ఘనంగా జరగనున్నాయి... బతుకమ్మ వేడుకల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యే సెప్టెంబర్ 21 నుండి దసరా పండగ తర్వాతిరోజు అక్టోబర్ 3 వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఇలా మొత్తంగా దసరా పండక్కి తెలంగాణ విద్యాసంస్థలకు 13 రోజుల సెలవులు ప్రకటించింది తెలంగాణ సర్కార్.

ఇక తెలంగాణ ఉద్యోగులకు బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యే సెప్టెంబర్ 21, దసరా పండగరోజు అక్టోబర్ 2, తర్వాతి రోజు అక్టోబర్ 3న సెలవులు ఉన్నాయి. ఇక దుర్గాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 30న ఐచ్చిక సెలవు ప్రకటించింది. ఇలా దసరా పండక్కి తెలంగాణ ఉద్యోగులకు నాల్రోజులు సెలవులు వస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories